POCO M8x 5G ట్యాబ్లెట్ లాంటి బిగ్ స్క్రీన్ మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో వచ్చింది.!

HIGHLIGHTS

POCO M8x 5G ట్యాబ్లెట్ లాంటి బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో వచ్చింది

ఈ స్మార్ట్ ఫోన్ వేగాన్ లెథర్ బ్యాక్ మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో వచ్చింది

ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

POCO M8x 5G ట్యాబ్లెట్ లాంటి బిగ్ స్క్రీన్ మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో వచ్చింది.!

POCO M8x 5G ట్యాబ్లెట్ లాంటి బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం గత వారం రోజులుగా టీజింగ్ చేసిన పోకో, ఎట్టకేలకు ఈరోజు ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వేగాన్ లెథర్ బ్యాక్ మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో వచ్చింది. ఈ లేటెస్ట్ ఫోన్ ప్రైస్, లాంచ్ ఆఫర్లు మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO M8x 5G: ప్రైస్

పోకో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను రెండు ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ లో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB + 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ని రూ. 20,999 రూపాయల ప్రైస్ తో మరియు 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 22,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లెథర్ గ్రీన్, బ్లాక్ మరియు బ్లూ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది.

POCO M8x 5G price and offers

సేల్ అండ్ ఆఫర్లు

ఈ స్మార్ట్ ఫోన్ పై ఆకట్టుకునే లాంచ్ ఫీచర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్లతో ఈ ఫోన్ కేవలం రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది.

Also Read: Jio 299 Plan: యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన రిలయన్స్ జియో.!

POCO M8x 5G: ఫీచర్స్

ఈ పోకో స్మార్ట్ ఫోన్ మెటాలిక్ మిడిల్ వేగాన్ లెథర్ ఫినిష్ మరియు క్వాడ్ కర్వుడ్ బ్యాక్ డిజైన్ తో వస్తుంది. 6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ ని గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ తో అందించింది. అలాగే, షియోమీ హైపర్ ఐలాండ్, HD + రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 5జి చిప్ సెట్ Snapdragon 4 Gen 5 తో నడుస్తుంది మరియు జతగా 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది మంచి పెర్ఫార్మెన్స్ అందించే బడ్జెట్ 4nm చిప్ సెట్ మరియు నెక్స్ట్ జనరేషన్ AI సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో సెటప్ మరియు Hi-Res ఆడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ 4 జనరేషన్ OS అప్గ్రేడ్ మరియు 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ సపోర్ట్ తో వస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఇది FHD వీడియో రికార్డింగ్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను భారీ 7900 mAh హెవీ బి బ్యాటరీతో పోకో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ మరియు 22.5W రివర్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile