Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ మాత్రం ఇంకా కానర్ఫ్మ్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేయకముందే ఈ ఫోన్ యొక్క ప్రైస్ వివరాలు ఇప్పుడు నెట్టింట్లో లీకయ్యాయి. లీకైన ప్రైస్ వివరాలతో పాటు ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా లీకయ్యాయి.
Survey
✅ Thank you for completing the survey!
Vivo T4x 5G లీకైన ధర ఏమిటి?
వివో ఈ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో 15 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని ప్రముఖ టిప్స్టర్ ముకుల్ శర్మ వెల్లడించారు. ముకుల్ శర్మ తన X అకౌంట్ నుంచి ఈ ఫోన్ ప్రైస్ గురించి హింట్ అందించారు. అంతేకాదు, ముకుల్ శర్మ తన ట్వీట్ లో ఈ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ తో కేవలం 15 రూపాయల కంటే తక్కువ ధరలో లాంచ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ని కూడా అంచనా చేసి చెబుతున్నారు. ఈ ఫోన్ ను వివో Dimensity 7300 చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉందట. ఇదే కాదు ఈ ఫోన్ ను Pronto Purple మరియు Marine Blue రెండు కలర్ ఆప్షన్ లతో వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని నివేదికలు అంచనా వేసి చెబుతున్నాయి.
ఈ ఫోన్ కొత్త కస్టమ్ లైట్ ను కలిగి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు చర్చించిన అన్ని ఫీచర్స్ కూడా కేవలం అంచనా ఫీచర్స్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా వివో త్వరలోనే వెల్లడించే అవకాశం వుంది.