Vivo T4x 5G: లాంచ్ డేట్, అంచనా ధర మరియు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
వివో అప్ కమింగ్ 5జి ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
Vivo T4x 5G లాంచ్ డేట్ ఎట్టకేలకు అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు అంచనా ధర మరియు అంచనా ఫీచర్ కూడా చూడనున్నాము
Vivo T4x 5G: అతిపెద్ద చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో అప్ కమింగ్ 5జి ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. వివో గత వారం రోజులుగా టీజింగ్ చేస్తున్న వివో T4x స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఎట్టకేలకు అనౌన్స్ చేసింది. అయితే, ఈరోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు అంచనా ధర మరియు అంచనా ఫీచర్ కూడా చూడనున్నాము.
SurveyVivo T4x 5G: లాంచ్ డేట్
వివో టి4x 5జి స్మార్ట్ ఫోన్ ను మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
Vivo T4x 5G: అంచనా ధర
వివో టి4x స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఇది వివో అందిస్తున్న బడ్జెట్ సిరీస్ మరియు ఇప్పటి వరకు ఈ సిరీస్ నుంచి నచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా బడ్జెట్ ధరలో వచ్చాయి,. ఈ ఫోన్ ను రూ. 12,499 రూపాయల ప్రారంభ ధరతో అందించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 4GB`వేరియంట్ ధర కావచ్చు. అలాగే, ఈ ఫోన్ 6GB వేరియంట్ ను రూ. 13,999 ధరతో మరియు 8GB వేరియంట్ ను 15,99 రూపాయల ధరతో అనౌన్స్ చేయవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

అయితే, ఆపిన తెలిపిన ధరలు అన్ని కూడా అంచనా ధరలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఒరిజినల్ ప్రైస్ వివరాలు వివో ఇంకా ప్రకటించలేదు.
Also Read: 6 వేలకే 100W LG Soundbar అందుకోండి.. ఎక్కడంటే.!
వివో టి4x 5జి: అంచనా ఫీచర్స్
ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గొప్ప డిజైన్ తో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ను 6. 67 ఇంచ్ FHD+ రిజల్యూషన్ స్క్రీన్ తో అందించే అవకాశం ఉండవచ్చు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అధిక బ్రైట్నెస్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమెరా ఉంటుంది. వివో ఈ ఫోన్ ను మీడియా టెక్ లేటెస్ట్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 7300 తో అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
మొత్తానికి ఈ ఫోన్ ను ఈ సిరీస్ నుంచి ముందుగా అందించిన ఫోన్స్ యొక్క తరువాతి తరం ఫోన్ గా అందించే అవకాశం ఉంటుంది.