Vivo T4 Lite 5G సెగ్మెంట్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ గా అవతరించనుంది.!
Vivo T4 Lite 5G స్మార్ట్ ఫోన్ కోసం వివో టీజర్ విడుదల చేసింది
టీజర్ నుంచి ఈ ఫోన్ సెగ్మెంట్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ గా అవతరించనుందని చెబుతోంది
T4 లైట్ 5జి ఫోన్ కీలక వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడించడం మొదలు పెట్టింది
Vivo T4 Lite 5G స్మార్ట్ ఫోన్ కోసం వివో టీజర్ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చేపట్టిన టీజర్ నుంచి ఈ ఫోన్ సెగ్మెంట్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ గా అవతరించనుంది, అని చెబుతోంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ కలిగిన 5జి స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుందని వివో టీజర్ ద్వారా వెల్లడించింది.
Vivo T4 Lite 5G
వివో టి4 లైట్ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ అయితే మొదలు పెట్టింది కానీ ఈ ఫోన్ ఫోన్ లాంచ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ‘Coming Soon’ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ క్యాంపైన్ స్టార్ట్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ తో జతగా చేప్పట్టిన మైక్రో సైట్ టీజర్ పేజి నుంచి టి4 లైట్ 5జి ఫోన్ కీలక వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడించడం మొదలు పెట్టింది.
Vivo T4 Lite 5G : కీలక ఫీచర్స్
వివో టి4 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ గా అవతరించనుందని వివో టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ ను లాంచ్ చేసే ప్రైస్ పరిధిలో పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా అందిస్తుంది. ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ వివరాలు కూడా వివో వెల్లడించింది. వివో టి4 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను 6000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
ఈ ఫోన్ బ్యాటరీ వివరాలు అందించిన ఇదే టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా, టైప్ C ఛార్జ్ పోర్ట్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంటుందని అర్థం అవుతుంది. ఈ ఫోన్ కూడా లేటెస్ట్ వివో ఫోన్స్ మాదిరిగానే AI సపోర్ట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ డిస్ప్లే వివరాలు కూడా త్వరలో అందిస్తామని కూడా వివో టీజర్ ద్వారా తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ను ఈ సెగ్మెంట్ లో అత్యంత బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ తో లాంచ్ చేయనున్నట్లు కూడా హింట్ ఇచ్చింది. అయితే, ఈ ఫీచర్ వివరాలు త్వరలో వెల్లడిస్తుంది.
Also Read: Realme Buds Wireless 5 Lite నెక్ బ్యాండ్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలక వివరాలు కూడా త్వరలో అందిస్తుందని తెలిపింది. ఈ ఫోన్ కొత్త అప్డేట్స్ మరియు మరిన్ని ఇతర వివరాలు త్వరలోనే అందిస్తాము.