Realme Buds Wireless 5 Lite నెక్ బ్యాండ్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

HIGHLIGHTS

కొత్త నెక్ బ్యాండ్ లాంచ్ చేయడానికి రియల్ మీ డేట్ సెట్ చేసింది

Realme Buds Wireless 5 Lite ఫీచర్స్ మరియు లాంచ్ డేట్ తో రియల్ మీ టీజింగ్ చేస్తోంది

రియల్ మీ లింక్ యాప్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు టీజింగ్ చేస్తుంది

Realme Buds Wireless 5 Lite నెక్ బ్యాండ్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

Realme Buds Wireless 5 Lite నెక్ బ్యాండ్ లాంచ్ చేయడానికి రియల్ మీ డేట్ సెట్ చేసింది. ఈ నెక్ బ్యాండ్ ఫీచర్స్ మరియు లాంచ్ డేట్ తో రియల్ మీ టీజింగ్ చేస్తోంది. ఈ నెక్ బ్యాండ్ లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ మరియు రియల్ మీ లింక్ యాప్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు టీజింగ్ చేస్తుంది. ఈ అప్ కమింగ్ రియల్ మీ నెక్ బ్యాండ్ లాంచ్ కంటే ముందే కీలక వివరాలు తెలుసుకుందాం.

Realme Buds Wireless 5 Lite : లాంచ్

రియల్ మీ బడ్స్ వైర్లెస్ 5 లైట్ నెక్ బ్యాండ్ ను జూన్ 23వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ నెక్ బ్యాండ్ అమెజాన్ నుంచి టీజింగ్ చేయబడుతోంది. అంటే, లాంచ్ తర్వాత అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Realme Buds Wireless 5 Lite : ఫీచర్స్

రియల్ మీ బడ్స్ వైర్లెస్ 5 లైట్ నెక్ బ్యాండ్ కంఫర్ట్ మరియు పాకెట్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఇది 12.4mm డైనమిక్ బాస్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు మ్యాజిత్ తో రెండు బెడ్స్ ను అటాచ్ చేసే సౌకర్యం కూడా కలిగి ఉంటుంది. ఈ నెక్ బ్యాండ్ ENC కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ మంచి కాలింగ్ అందిస్తుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది.

Realme Buds Wireless 5 Lite

ఈ రియల్ మీ అప్ కమింగ్ నెక్ బ్యాండ్ IP55 రేటింగ్ తో హార్డ్ కోర్ క్వాలిటీ బిల్డ్ కలిగి ఉంటుందని రియల్ మీ వెల్లడించింది. ఈ నెక్ బ్యాండ్ బ్లేడుటూత్ కనెక్టివిటీ వెర్షన్ 5.4 మరియు డ్యూయల్ డివైజ్ కనెక్షన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ నెక్ బ్యాండ్ 45ms లో లెటెన్సీ తో గొప్ప గేమింగ్ అనుభూతిని అందిస్తుందని కూడా రియల్ మీ వెల్లడించింది.

Also Read: Jio Network Down: జియో మొబైల్ నెట్ వర్క్ డౌన్ తో ఇక్కట్లు పడుతున్న యూజర్లు.!

ఈ బడ్స్ 35 గంటల ప్లే అందించే గొప్ప బ్యాటరీ తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ సైబర్ ఆరెంజ్, హేజ్ బ్లూ మరియు వాయిడ్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుందని రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ నెక్ బ్యాండ్ లాంచ్ తో ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తో మళ్ళి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo