Jio Network Down: జియో మొబైల్ నెట్ వర్క్ డౌన్ తో ఇక్కట్లు పడుతున్న యూజర్లు.!
రిలయన్స్ జియో నెట్ వర్క్ ఈరోజు డౌన్ అయ్యింది
డౌన్ డిక్టేటర్ సాక్షి వ్యాప్తంగా ఉన్న యూజర్లు రిపోర్ట్ చేయడం గమనార్హం
హైదరాబాద్, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు వంటి మెట్రో సిటీల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువ
Jio Network Down: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నెట్ వర్క్ ఈరోజు డౌన్ అయ్యింది. డౌన్ డిక్టేటర్ సాక్షి వ్యాప్తంగా ఉన్న యూజర్లు రిపోర్ట్ చేయడం గమనార్హం. మొబైల్ నెట్ వర్క్ డౌన్ అవ్వడంతో డేటా మరియు కాలింగ్ సమయంలో యూజర్లు ఇక్కట్లు చేసినట్లు వాపోయారు. ముఖ్యంగా, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు వంటి మెట్రో సిటీల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు యూజర్ల చేసిన రిపోర్ట్ చెబుతోంది.
Jio Network Down:
రిలయన్స్ జియో మొబైల్ నెట్ వర్క్ దేశవ్యాప్తంగా డౌన్ అయినట్లు ప్రముఖ అవుటేజ్ మోనిటర్ సైట్ డౌన్ డిక్టేటర్ తెలిపింది. ఈ సైట్ లో దేశవ్యాప్తంగా చాలా సిటీల నుంచి యూజర్లు రిపోర్ట్ చేయడం గమనార్హం. మొబైల్ ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ మరియు జియో ఫైబర్ సర్వీసు లలో ఈ ఈ సమస్య ఎక్కువ చూసినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు.
ఇక రిపోర్ట్ విషయానికి వస్తే, జియో నెట్ వర్క్ సమస్య గురించి 15 వేల కంటే ఎక్కువ మంది యూజర్లు డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ చేశారు. ఇందులో 57 శాతం మంది యూజర్లు మొబైల్ ఇంటర్నెట్ గురించి రిపోర్ట్ చేయగా, 32 శాతం మంది యూజర్లు మొబైల్ ఫోన్ మరియు 12 శాతం మంది జియో ఫైబర్ సర్వీసు గురించి రిపోర్ట్ చేశారు.
అయితే, రిపోర్ట్ కు అందించిన యూజర్ కామెంట్ లో ఎక్కువ కేరళ యూజర్ల కామెంట్స్ దర్శనమిచ్చాయి. ఇందులో కేరళ లో జియో నెట్ వర్క్ పని చేయడం లేదని తమదైన ఫన్నీ కామెంట్స్ తో యూజర్లు రిపోర్ట్ చేశారు. అయితే, ప్రస్తుతం నెట్ వర్క్ రిస్టోర్ అయినట్లు పూర్తి స్థాయిలో సర్వీస్ లు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Tecno Pova 7 Series: ఐకానిక్ ట్రయాంగిల్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!
అయితే, రిపోర్ట్ అందుకున్న మ్యాప్ ను పరిశీలిస్తే, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు వంటి మెట్రో సిటీల్లో ఎక్కువగా సమస్య చూసినట్లు రిపోర్ట్ సూచిస్తుంది. ఈ మ్యాప్ లో చూపిన రెడ్ కలర్ రిపోర్ట్ పరిధి తెలుపుతుంది.
ఇటీవల కూడా జియో ఫైబర్ సర్వీస్ లో సమస్య చూసినట్లు మరియు సర్వీస్ డౌన్ అయినట్లు రిపోర్ట్ అందుకుంది డౌన్ డిక్టేటర్.