Tecno Pova 7 Series: ఐకానిక్ ట్రయాంగిల్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!
టెక్నో ఇండియాలో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తోంది
Tecno Pova 7 Series లాంచ్ చేస్తున్నట్లు టెక్నో అనౌన్స్ చేసింది
ఐకానిక్ ట్రయాంగిల్ కెమెరాతో తీసుకొస్తున్నట్లు కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది
Tecno Pova 7 Series: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ టెక్నో ఇండియాలో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తోంది. టెక్నో పోవా సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ టెక్నో పోవా 7 సిరీస్ ను లాంచ్ చేస్తున్నట్లు టెక్నో అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ ఫోన్లను ఐకానిక్ ట్రయాంగిల్ కెమెరాతో తీసుకొస్తున్నట్లు కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది.
Tecno Pova 7 Series: లాంచ్
టెక్నో పోవా 7 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ గురించి కంపెనీ ఎటువంటి అప్డేట్ అందించలేదు. కమింగ్ సూన్ ట్యాగ్ తో ఈ సిరీస్ లాంచ్ గురించి టీజింగ్ స్టార్ట్ చేసింది. కంపెనీ యొక్క అధికారిక X అకౌంట్ నుంచి మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఫోన్ టీజింగ్ స్టార్ట్ చేసింది. అంటే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కట్ ప్రత్యేకమైన ఆన్లైన్ సాల్ పార్ట్నర్ గా ప్రకటించింది. అందుకే, ఈ అప్ కమింగ్ టెక్నో స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
Tecno Pova 7 Series: ఫీచర్స్
టెక్నో ఈ అప్ కమింగ్ సార్ట్ ఫోన్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి ఫీచర్స్ కూడా బయటకు వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ కెమెరా మోడ్యూల్ మరియు డిజైన్ గురించి మాత్రం టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లో ఐకానిక్ ట్రయాంగిల్ కెమెరా సెటప్ ఉన్నట్లు టెక్నో ఆటపట్టిస్తోంది. అయితే, రీసెంట్ గా గ్లోబల్ మార్కెట్లో టెక్నో విడుదల చేసిన అదే టెక్నో పోవా 7 సిరీస్ ఫోన్స్ ఇండియాలో విడుదల కాబోతున్న టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ అవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇక వేళ ఇదే అంచనా కనుక నిజం అయితే, ఈ సిరీస్ నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చు. లేదంటే, ఇండియాలో పెరుగుతున్న 5జి స్మార్ట్ ఫోన్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని రెండు 5జి వేరియంట్స్ లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చు. అయితే, టెక్నో అధికారికంగా అనౌన్స్ చేసే వరకు విషయం పై పూర్తిగా ఒక అవగాహనకు రాలేము.
Also Read: Realme Narzo 80 Lite: బడ్జెట్ ధరలో సూపర్ స్లిమ్ డిజైన్ పవర్ ఫుల్ బ్యాటరీతో వచ్చింది.!
Tecno Pova 7 Series: అంచనా ఫీచర్స్
అపియన్ తెలిపిన విధంగా ఒక వేళ గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసే అదే ఫోన్ లను ఇండియాలో కూడా విడుదల చేస్తే మాత్రం ఈ ఫోన్ గొప్ప గేమింగ్ ఫోనుగా వస్తుంది. ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ కర్వుడ్ AMOLED డిస్ప్లే, మీడియాటెక్ Dimensity 7300 Ultimate చిప్ సెట్ మరియు 45W ఫ్లాష్ ఛార్జ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఈ సిరీస్ ఫోన్ లను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.
టెక్నో పోవా 7 సిరీస్ లాంచ్ డేట్ మరియు ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న వేరియంట్స్ మరియు వాటి కీలకమైన ఫీచర్స్ కూడా త్వరలోనే టెక్నో వెల్లడించే అవకాశం ఉంది.