Realme Narzo 80 Lite: రియల్ మీ ఈరోజు బడ్జెట్ సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో సూపర్ స్లిమ్ డిజైన్ పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ చేసింది. భారత మార్కెట్లో 10 వేల రూపాయల బడ్జెట్ లో నడుస్తున్న చాలా స్మార్ట్ ఫోన్ లకు గొప్ప పోటీగా ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చినట్లు రియల్ మీ చెబుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Realme Narzo 80 Lite: ప్రైస్
రియల్ మీ నార్జో 80 లైట్ ఫోన్ ను రెండు వేరియంట్ విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 4GB+ 128GB వేరియంట్ ను రూ. 10,499 ధరతో మరియు 6GB+ 128GB వేరియంట్ ను రూ. 11,499 ధరతో ప్రకటించింది. జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు రియల్ మీ అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ అవుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 500 రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 9,999 రూపాయల ధరకే లభిస్తుంది.
రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ ను బిగ్ బ్యాటరీతో కేవలం 7.9mm సూపర్ స్లిమ్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ స్క్రీన్ ను HD+ రిజల్యూషన్ తో మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. రియల్ మీ ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.
కెమెరా పరంగా, రియల్ మీ నార్జో 80 లైట్ ఫోన్ లో వెనుక 32MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరాలను అందించింది. ఈ ఫోన్ FHD వీడియోలు, మంచి ఫోటోలు పొందవచ్చని రియల్ మీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో మంచి కెమెరా ఫీచర్స్ అందించినట్లు కూడా రియల్ మీ పేర్కొంది. ఈ రియల్ మీ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ, 5W రివర్స్ ఛార్జ్ మరియు 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.