Upcoming Smartphones: వచ్చే వారం విడుదల కాబోతున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే.!
వచ్చే వారం భారత మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి
కొన్ని స్మార్ట్ ఫోన్స్ చాలా కాలంగా టీజింగ్ అవుతుండగా, కొన్ని స్మార్ట్ ఫోన్ లు కొత్తగా లిస్ట్ అయ్యాయి
ఈరోజు వచ్చే వారం ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ చూడనున్నాము
Upcoming Smartphones: వచ్చే వారం భారత మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్స్ చాలా కాలంగా టీజింగ్ అవుతుండగా, కొన్ని స్మార్ట్ ఫోన్ లు కొత్తగా లిస్ట్ అయ్యాయి. వచ్చే వారం ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఈరోజు చూడనున్నాము.
Upcoming Smartphones:
వచ్చే వారం ప్రారంభం నుండి చివరి వరకు చాలా స్మార్ట్ ఫాన్స్ లాంచ్ అవుతున్నాయి. వీటిలో ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ మొదలు కొని బడ్జెట్ ఫోన్స్ వరకు ఉన్నాయి.
Vivo X200 Series
వివో తన అప్ కమింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ను వచ్చే వారం లాంచ్ చేస్తోంది. X200 సిరీస్ నుంచి రెండు ఫోన్లను విడుదల చేస్తుంది. ఇందులో, X200 మరియు X200 Pro స్మార్ట్ ఫోన్ లు ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా డిసెంబర్ 12న లాంచ్ అవుతాయి. ఈ ఫోన్స్ ZEISS ప్రీమియం కెమెరా సెటప్, సూపర్ డిజైన్, పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నాయి.
Redmi Note 14 5G Series
రెడ్ మీ నోట్ 14 5జి సిరీస్ కూడా వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతాయి. ఈ సిరీస్ నుంచి రెడ్ మీ నోట్ 14 5జి మరియు నోట్ 14 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఈ రెడ్ మీ నోట్ 14 5జి సిరీస్ డిసెంబర్ 9న ఇండియాలో లాంచ్ అవుతాయి. ఈ సిరీస్ ను MiAi, Sony కెమెరా, ప్రకాశవంతమైన స్క్రీన్ లతో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది.
Also Read: 10 వేల బడ్జెట్ లో లభించే బెస్ట్ Dolby Atmos Soundbar కోసం చూస్తున్నారా.!
Moto G35 5G
మోటోరోలా తన అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటో జి 35 5జి ని కూడా వచ్చే వారమే విడుదల చేస్తోంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్, FHD+ స్క్రీన్, 4K వీడియో రికార్డ్ చేసే 50MP కెమెరా మరియు 20W ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ వస్తోంది.