10 వేల బడ్జెట్ లో లభించే బెస్ట్ Dolby Atmos Soundbar కోసం చూస్తున్నారా.!

10 వేల బడ్జెట్ లో లభించే బెస్ట్ Dolby Atmos Soundbar కోసం చూస్తున్నారా.!
HIGHLIGHTS

10 వేల రూపాయల బడ్జెట్ లో Dolby Atmos Soundbar

ఒకప్పుడు Dolby Atmos సౌండ్ బార్ కొనడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం

పవర్ ఫుల్ సౌండ్ అందించే Dolby Atmos సౌండ్ బార్స్

10 వేల రూపాయల బడ్జెట్ లో Dolby Atmos Soundbar కోసం చూస్తున్నారా? అయినా కూడా మీకు మంచి ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొనడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని గా ఉండేది. అయితే, ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ మరియు కాంపిటీషన్ తో 10 వేల బడ్జెట్ లో కూడా పవర్ ఫుల్ సౌండ్ అందించే Dolby Atmos సౌండ్ బార్స్ లభిస్తున్నాయి.

Dolby Atmos Soundbar : డీల్స్

ఇండియాలో, బడ్జెట్ ధరలో కూడా Dolby Atmos సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్ లను అందిస్తున్న కంపెనీగా జెబ్రోనిక్స్ నిలుస్తుంది ఈ కంపెనీ 10 వేల బడ్జెట్ లో చాలా ఆప్షన్ లను అందిస్తుంది. అలాగే, GOVO బ్రాండ్ నుంచి కూడా మంచి సౌండ్ బార్ డీల్స్ అందిస్తోంది. ఈ డీల్స్ ఇప్పుడు చూద్దాం.

ZEBRONICS Zeb-Juke BAR 3850 PRO

Dolby Atmos Soundbar

జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ రూ. 8,999 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 170W RMS సౌండ్ అందిస్తుంది మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్ మరియు 4 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగి ఉంటుంది. డ్యూయల్ HDMI పోర్ట్ లతో 4K HDR passthrough సపోర్ట్ తో వస్తుంది. సౌండ్ బార్ డీల్స్ చెక్ చేయడానికి Click here

Also Read: Redmi Note 14 5G: సూపర్ బ్రైట్నెస్ స్క్రీన్ మరియు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!

GOVO GOSURROUND 975

Dolby Atmos Soundbar

ఈ సౌండ్ బార్ 2.1.2 ఛానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 400W హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. సౌండ్ బార్ డీల్స్ చెక్ చేయడానికి Click here

ZEBRONICS Jukebar 1000

Dolby Atmos Soundbar

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కూడా Dolby Atmos సౌండ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అయితే, ఈ సౌండ్ బార్ రేణు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో మాత్రమే వస్తుంది. కానీ 200W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రస్తుతం రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కూడా HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. సౌండ్ బార్ డీల్స్ చెక్ చేయడానికి Click here

నోట్: ఈ ఆర్టికల్ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo