బడ్జెట్ స్మార్ట్ ఫోనుతో కూడా సూపర్ క్వాలిటీ ఫోటోలను తియ్యాలంటే ఈ టిప్స్ తెలుసుకోండి

బడ్జెట్ స్మార్ట్ ఫోనుతో కూడా సూపర్ క్వాలిటీ ఫోటోలను తియ్యాలంటే ఈ టిప్స్ తెలుసుకోండి
HIGHLIGHTS

ప్రీమియం ఫోన్ కెమెరా వంటి ఫోటోలను మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తో ఎలా తీయవచ్చు

గతంలో, ఒక మొబైల్ ఫోనుతో ఫోటోలను తీయ్యడం అంటే ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే, కేవలం 5MP లేదా 8MP సింగల్ కెమేరాలతో మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండేవి. అదొక్కటే కాదు, ఈ కెమేరా పూర్తిగా మాన్యువల్ పద్దతిలో ఉండేది. అయితే, అన్నింటికంటే ముందుగా మంచి ఫోటోలను తీయగలిగే కెమెరాతో మంచి ఫోన్ను తీసుకొచ్చిన ఘనత మాత్రం Nokia సంస్థకే దక్కతుంది. నోకియా సంస్థ, తన Nokia N8 ఫోనులో అందించిన 12MP కెమేరా, నిజంగా అప్పట్లో  ఒక అద్భుతమని చెప్పొచ్చు. కానీ, అటువంటి ఫోన్ను పొందాలంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం.     

అయితే, ప్రస్తుతం కేవలం 5,000 నుండి 10,000 ధరలో కూడా  మల్టి కెమేరాలతో, అదీకూడా ఎక్కువ రిజల్యూషన్ గల కెమేరాలు గల స్మార్ట్ ఫోన్ను కొనేవీలుంది. కానీ, మీ ఫోనులో యెంత మంచి కెమేరా వున్నా కూడా కొన్ని సార్లు మీరు తీసే ఫోటోలు మీకు అంత సంతృప్తి కరంగా అనిపించవు. అందుకు కారణంగా ఫోటో క్లియర్ గా లేకపోవడం, లేదా బ్యాగ్రౌండ్ వెలితిగా ఉండడం లేదా మీరు ఊహించిన విధంగా లేకపోవడం వంటి ఎన్నో కారణాలు మీ ముందు మెదలాడుతాయి. అందుకే, ప్రీమియం ఫోన్ కెమెరా వంటి ఫోటోలను మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తో ఎలా తీయవచ్చునో, దానికోసం మీరు తెలుసుకోవాల్సిన 5 బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇక్కడ అందిస్తున్నాను.

1. కెమేరా లెన్స్ క్లీన్ చెయ్యండి

మనం మన ఫోన్ను అనేక విధాలుగా వాడుతుంటాం మరియు మనలో చాలా మంది ఫోన్ వాడిన ప్రతీసారి క్లీన్ చెయ్యరు. అయితే, మీరు ఫోటోలను తీయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ కెమేరా లెన్స్ ని క్లీన్ చేయ్యాలి. ఎందుకంటే, ఒక స్మార్ట్ ఫోన్ కెమేరా లెన్స్ చాలా చిన్నదిగా వుంటుంది మరియు ఒక చిన్న గీత లేదా డస్ట్ కూడా మీ ఫొటో మొత్తాన్ని అస్పష్టంగా ఉండేలా చేసే అవకాశం వుంటుంది.

2. ఫోకస్ ఆన్ కాన్సెప్ట్

మీరు ఎటువంటి ఫోటోలను తీయాలనుకుంటున్నారో, దాన్ని ముందుగానే మీరు నిర్ణయం తీసుకొని పూర్తిగా దాని పైన ద్రుష్టి పెట్టాలి. అంటే, మీ మనసులోని భావాలను చిత్రీకరించేలా ఫోటోను తీయాలని మీరు భావిస్తుంటే, దాన్ని ముందుగా ఎలా ఎక్కడ తీయాలనుకుంటున్నారో  నిర్ణయించుకోవాలి.

ఉదాహరణ : సన్ రైజ్, ప్రకృతి, పక్షులు, కోటలు ఇటువంటి మరిన్ని..

3. తగినంత వెలుగు

మీరు గనుక ఎక్కువ రిజల్యూషన్, షార్ప్ మరియు క్రిస్పీ ఫోటోలను తీయాలనుకుంటే మీకు తగినంత ఎక్కువ వెలుతురు అవసరమవుతుంది. పగటి సమయంలో మీకు తగినంత వెలుతురు ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో మంచి ఫోటోలను తీయ్యొచ్చు. అలాగే, సూర్యుడు ఎటువైపు ఉన్నాడు, నీడ ఎటువైపు పడుతుంది వంటి విషయాలను గమనించి, మీరు ఫోటో తీయదలచిన సబ్జెక్టు పైన ఏక్కువగా వెలుగు ఉండేలా చూడాలి.

4. పగలు కూడా ఫ్లాష్ ని వాడండి

 సాధారణంగా, తగినంత వెలుగు లేనప్పుడు లేదా చీకటి సమయంలో తీసే ఫోటో కోసం ఫ్లాష్ ని వాడుతుంటాం. అయితే, మనం పగలుకూడా ఫ్లాష్ వాడొచ్చు. ముఖ్యంగా, పోర్ట్రైట్ ఫోటోలను తీసేప్పుడు ఫ్లాష్ వాడడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. పోర్ట్రైట్ ఫోటోలను తీసేప్పుడు ఫ్లాష్ లైట్ వాడడం వలన ఎటువంటి షేడ్ లేకుండా ఫోటో చాల బ్రైట్ మరియు వైబ్రాంట్ గా వస్తుంది.

5. మీ ఫోన్ ఇంటెలిజన్స్ వాడుకోండి

ప్రస్తుతం, దాదాపుగా అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లు కూడా వాటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (AI) ని ఉపయోగించి మంచి ఫోటోలను ఎటువంటి ఎడిటింగ్ అవసరం లేకుండానే అందిస్తాయి. ఇందులో చూస్తే గూగుల్ మరియు ఆపిల్ ప్రీమియం ఫోన్లలో వాటి సొంత సాఫ్ట్వేర్ తో చాలా గొప్ప ఫోటోలను తీసే సామర్ధ్యంతో ఉంటాయి. కానీ, బడ్జెట్ ఫోన్ల విషయానికి వస్తే, హానర్ మరియు శామ్సంగ్ వంటివి సొంత సాఫ్ట్ వేర్ తో మంచి ఫోటోలను తీసేవిధంగా ఉంటే, మిగిలిన  ఫోన్లు AI తో మంచి ఫోటాలను తీయగలవు. అయితే, మంచి బ్యాగ్రౌండ్ లేదా బ్రెట్ ఫోటోలను తియ్యడానికి గూగుల్ ఫొటోస్ సహాయం చేస్తుంది.                                     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo