Jio Best Plan: చౌక ధరలో అన్ని ప్రయోజనాలు అందించే జియో ప్లాన్.!
Jio Best Plan జియో తన యూజర్ల కోసం అందించింది
చౌక ధరలో అన్ని ప్రయోజనాలు అందించే ప్లాన్స్
Jio Best Plan: అన్ని ప్రయోజనాలను అందించే చాలా ప్లాన్ లను జియో తన యూజర్ల కోసం అందించింది. అయితే, వాటిలో కొన్ని ప్లాన్స్, చౌక ధరలో అన్ని ప్రయోజనాలు అందించేవిగా ఉన్నాయి. ఈరోజు ఈ బెస్ట్ ప్లాన్ మరియు ఆ ప్లాన్స్ అందించే అన్ని ప్రయోజనాలను చూడనున్నాము.
SurveyJio Best Plan
అన్ని లాభాలను అందించే జియో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది రూ. 1,198 రూపాయల అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్. ఈ జియో లేటెస్ట్ బడ్జెట్ అల్రౌండ్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఇక్కడ చూడవచ్చు.
జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్
జియో యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే, 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. కాలింగ్ తో పాటు అన్లిమిటెడ్ 5G డేటాని, రోజుకు 100 SMS సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది.
అదే 4G నెట్వర్క్ అయితే, ఈరోజు 2GB డేటా చొప్పున 84 రోజులకు 168 GB 4జి డేటాని అందిస్తుంది. ఇంతటితో ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలు ముగిసిపోలేదు. ఎందుకంటే, ఈ ప్లాన్ తో 14 OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
Also Read: Gold Rate: ఎంత పెరిగిందో ఈరోజు అంత తగ్గిన గోల్డ్ రేట్.!
ఈ ప్లాన్ తో Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi ప్లాట్ ఫామ్ లకు JioTV Mobile App ద్వారా అందిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile