రూ.20,000 ధరలో బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫోన్స్ లిస్ట్.!

రూ.20,000 ధరలో బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫోన్స్ లిస్ట్.!
HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్ లో రూ.20,000 ధరలో లభిసున్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్

బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్లలో టాప్ 5 ఫోన్

20 వేల ధరలో బెస్ట్ 5G ఫోన్స్ లిస్ట్ ఇక్కడ వుంది

ఇండియన్ మార్కెట్ లో రూ.20,000 ధరలో లభిసున్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీరు ఈరోజు ఖచ్చితమైన వివరాలను పొందబోతున్నారు. ఈరోజు మనం ఇండియాలో లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్లలో టాప్ 5 ఫోన్ల గురించి చుడనున్నాము. ఈ లిస్ట్ లో అందించిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో లభిస్తున్నాము మరియు మంచి పర్ఫార్మెన్స్ అందించాగల సత్తాను కలిగివుంటాయి. రూ.20,000 ధరలో బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ లలో టాప్ 5 ఫోన్లు ఏమిటో తెలుసుకుందామా.            

1. Redmi Note 11 Pro+ (Buy Here)

రెడ్ మి నోట్ 11 ప్రో+ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది. కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 108MP మైన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను కలిగివుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఇది MIUI 13 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది.

2. Redmi Note 11T 5G (Buy Here)

రెడ్ మి నోట్ 11టి 5జి ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Dimensity 810 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది. కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, డెప్త్ మరియు పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది.

3. Moto G71 5G (Buy Here)

మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఇది పంచ్ హోల్ డిజైన్ మరియు DCI-P3 తో వస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చింది మరియు ఈ ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా కూడా నిలిచింది. ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ తో జతచెయ్యబడింది. అధనంగా, ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు IP52 వాటర్ రెపెల్లెంట్ తో వస్తుంది. మోటో జి71 5జి లో వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్/డెప్త్ సెన్సార్ మరియు డేడికేటెడ్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది. ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.

4. vivo T1 5G (Buy Here)

Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. వివో T1 5జి ఫోన్ లో వెనుక 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.

5. OnePlus Nord CE 2 5G (Buy Here)

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది.ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo