Realme సంస్థ, ఈరోజు ఇండియాలో తన Narzo 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ విడుదల చేస్తోంది. ఈ Realme Narzo 30 సిరీస్ నుండి Narzo 30 Pro మరియు Narzo 30A స్మార్ట్‌ఫోన్స్ ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు, ఈ రోజు జరగనున్న లాంచ్ ఈవెంట్ నుండి Realme Buds Air 2 ను కూడా లాంచ్ చేస్తునట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ మధ్యాహ్నం 12:30 నిముషలకు లాంచ్ చేయబడతాయి. ఈ LIVE కార్యక్రమం Realme యొక్క అన్ని షోషల్ మీడియా హ్యాడిల్స్ లలో ప్రసారమవుతాయి.
Survey
✅ Thank you for completing the survey!
ఇక ఈ Narzo 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ప్రత్యేకతల విషయానికి వస్తే, Narzo 30 Pro స్మార్ట్‌ఫోన్ 5G సపోర్ట్ కలిగిన Dimensity 800U ప్రొసెసర్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ డిస్ప్లే కూడా 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.5 ఇంచ్ FHD+ రిజల్యూషన్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈ Narzo 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లో ఇవ్వనున్న ఛార్జింగ్ సపోర్ట్ ని కూడా చర్చింది. ఇందులో 30 Wడార్ట్ ఛార్జింగ్ ఇస్తున్నట్లు టీజ్ చేసింది.
ఈ Narzo 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లో పెద్ద 6,000mAh బ్యాటరీ తో తీసుకొస్తున్నట్లు తెలిపింది. అయితే, Narzo 30 సిరీస్ రెండు స్మార్ట్‌ఫోన్స్ లలో ఇదే బ్యాటరీ వుండబోతోందా లేక మార్పులు ఉంటాయనే విషయం ఫోన్స్ లాంచ్ సమస్యలో తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్ గేమింగ్ కోసం మంచిగా పనిచేయవచ్చు. ఎందుకంటే, Relame స్మార్ట్‌ఫోన్స్ గురించి For The Young 5G ప్లేయర్స్ అని చెబుతోంది.