ఈ రోజు మద్యహ్నం 12:30 కి రియల్మీ3 లాంచ్ : నమ్మశక్యం కానీ ధరతో విడుదల చేయనున్నట్లు టీజ్ చేస్తున్న కంపెనీ
ఈ ఫోన్ యొక్క టీజింగును మరియు ఈ స్పెక్స్ గురించి ఫ్లిప్ కార్ట్ లోని ఒక వెబ్ పేజీలో వెల్లడించింది.
రియల్మీసంస్థ నుండి రానున్నటువంటి సరికొత్త స్మార్ట్ ఫోన్, రియల్మీ3 ఈ రోజు మద్యహ్నం 12:30 గంటలకి విడుదలకానుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురుంచి ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన ఒక మైక్రో సైట్ నుండి, దీని గరించిన టీజింగులను అందిస్తుంది. అదనంగా, ఈ కొత్త వెబ్ పేజీ అధికారికంగా ఫోన్ రావడానికంటే ముందుగానే హ్యాండ్సెట్ యొక్క కొన్ని కీలకమైన వివరాలను వెల్లడిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, ఇటీవలే ప్రారంభించిన Redmi Note 7 Pro మరియు Redmi Note 7 స్మార్ట్ ఫోన్ల కి పోటీగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Surveyరియల్మి 3, ఒక మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్ తో రానుంది మరియూ ఇది ఒక 12 nm విధానంలో నిర్మించబాదినట్లు చెబుతోంది. ఈ హీలియో P70 ప్రాసెసర్, ఒక 14nm ప్రాసెసరుతో పోల్చబడింది, ఒకవిధంగా ఇది రెడ్మి నోట్ 7 లో ఉపయోగించిన 14nm స్నాప్ డ్రాగన్ 660 గురించి వివరిస్తునట్లు కనిపిస్తుంది. రియల్మి3 లో డ్యూ – డ్రాప్ నోచ్ డిస్ప్లే డిజైన్, ఒక 4230 mAh బ్యాటరీతో ఉన్నట్లు కూడా ఈ టీజర్ పేజీ నిర్ధారించింది. దీని బ్యాటరీ గురించి కూడా మరొకసారి సరిపోలిక చేసింది, 'చిన్న బ్యాటరీల' తో పోల్చబడింది, అంటే ఇది రెడ్మి నోట్ 7 సిరీసులో ఉపయోగించిన 4,000mAh బ్యాటరీకి సూచనగా చెప్పవచ్చు.
Realme నుండి రాబోయే Realme 3 స్మార్ట్ఫోన్ గురించి మొత్తం అధికారిక సమాచారాన్ని వెల్లడించింది. అయినప్పటికీ, ఈ ఫోన్ యొక్కప్రో వేరియంట్ కూడా స్టాండర్డ్ వేరియంట్ తో పాటుగా ప్రకటించబడుతుంది మరియు ఒక టీజర్ వీడియో ద్వారా వీటిని చూపించవచ్చు, ఇది వేగవంతమైన ఛార్జింగ్ కి మద్దతుతో వస్తుంది. ఇటీవలే, రియర్ ప్యానల్ కోసం డైమండ్-కట్ డిజైన్తోపాటు, డ్యూయల్ -వెనుక కెమెరా మరియు వెనుకవైపు మౌంట్ చేయబడిన వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉండనున్నట్లు, ధ్రువీకరించబడింది.