ఇండియాలోని సరసమైన ధరలో 5 బెస్ట్ 4GB RAM ఫోన్లు

ఇండియాలోని సరసమైన ధరలో 5 బెస్ట్ 4GB RAM ఫోన్లు
HIGHLIGHTS

4GB ర్యామ్ తో అందుబాటులో ఉన్నటువంటి ఫోన్లలో బెస్ట్ ఫోన్ల గురించి, మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో ఎంపికలు అందుబాటులో వున్నా కూడా 4GB ర్యామ్ తో అందుబాటులో ఉన్నటువంటి ఫోన్లలో బెస్ట్ ఫోన్ల గురించి, మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కేవలం ర్యామ్ మాత్రమేకాకుండా, ధర, బ్యాటరీ, ప్రాసెస్ మరియు కెమేరా పరంగా బెస్ట్ ఫీచర్లతో మనం కొనుగోలు చేయదగిన బెస్ట్ ఫోనల్ను జాబితాగా అందిస్తున్నాను.         

1.XIAOMI REDMI NOTE 7 PRO 

Redmi Note 7 Pro ,ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా SONY IMX586 సెన్సారుతో ఒక స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చిన ఘనత, కేవలం షావోమి మాత్రమే సొంతం అని చెప్పొచ్చు. కేవలం, కెమేరా మాత్రమే కాదు ఒక స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 6GB వంటి ర్యామ్ ఎంపికలతో కూడా లభిస్తుంది. అలాగే, ఒక 4,000 బ్యాటరీతో ఒక రోజంతా కూడా చక్కగా సరిపోయేలా అందించారు.

2. REALME 3 PRO

రియల్మీ 3 ప్రో  స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8%  స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది. 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519  సెన్సారుతో వస్తుంది.

3. SAMSUNG GALAXY M30

శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904  ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 13MP +5MP+5MP  ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది.

4. NOKIA 6.1 PLUS 

నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD+ నోచ్ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3060 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 16MP +5MP డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది.

5. XIAOMI MI A2

షావోమి నుండి ముందుగా వచ్చిన ఈ కెమేరా ఫోన్, స్మార్ట్ ఫోన్ 2160 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 FHD+ ఫుల్ వ్యూ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 660AIE ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3010 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 12MP +20MP  డ్యూయల్  కెమేరా సేటప్పుతో మరియు ముందు 20MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది ప్రస్తుతం రూ.11,999 ప్రారంభదరతో లభిస్తోంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo