Tecno Pova 8 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన 8000 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ సేల్.!

HIGHLIGHTS

టెక్నో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోవా 8 5జి సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది

ఈ స్మార్ట్ ఫోన్ 8000 mAh బిగ్ బ్యాటరీ, సెకండరీ డాట్ మాట్రిక్స్ డిస్ప్లే ఉంది

ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

Tecno Pova 8 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన 8000 mAh బిగ్ బ్యాటరీ ఫోన్ సేల్.!

Tecno Pova 8 5G: టెక్నో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోవా 8 5జి సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ స్మార్ట్ ఫోన్ 8000 mAh బిగ్ బ్యాటరీ, సెకండరీ డాట్ మాట్రిక్స్ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ అండ్ బిగ్ కూలింగ్ సిస్టమ్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదలైన ఈ ఫోన్ మంచి ఆఫర్లతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రైస్ అండ్ ఆఫర్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Pova 8 5G: ప్రైస్ అండ్ ఆఫర్లు

టెక్నో పోవా 8 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 29,999 ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ ను రూ. 31,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 16 బిట్ వైట్ మరియు టర్మినల్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

Tecno Pova 8 5G

ఇక ఈ ఫోన్ పై టెక్నో అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను SBI, ICICI, HDFC మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 28,499 ధరలో ఈ ఫోన్ లభిస్తుంది.

Also Read: Claude AI Down: సర్వీస్ పూర్తిగా డౌన్ అయినట్లు భారీగా ఫిర్యాదు నమోదు చేసిన యూజర్లు.!

Tecno Pova 8 5G: ఫీచర్స్

టెక్నో పోవా స్మార్ట్ ఫోన్ లో 6.76 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ని టెక్నో అందించింది. ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు మంచి బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది, డిజైన్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ దృఢమైన MIL-STD 810 H సర్టిఫికేషన్ మరియు IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ ప్రత్యేకమైన “Alive Matrix Display” LED బ్యాక్ ప్యానెల్ తో కూడా వస్తుంది. ఈ సెటప్ ష ఈ ఫోన్ ప్రీమియం లుక్స్ తో ఆకట్టుకుంటుంది.

ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7100 5G చిప్‌ సెట్ తో టెక్నో అందించింది. ఈ చిప్ సెట్ తో జతగా 8జీబీ ర్యామ్ మరియు 128జీబీ స్టోరేజ్ ని కూడా అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 16 ఆధారిత Hi OS 16 సాఫ్ట్ వేర్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ AI ఆధారిత స్మార్ట్ ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, 50MP (Sony LYT 600) ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో AI CAM, AIGC Portrait వంటి ఏఐ కెమెరా ఫీచర్స్ తో పాటు మంచి వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ భారీ 8000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు మంచి లాంగ్ లైఫ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile