Claude AI Down: సర్వీస్ పూర్తిగా డౌన్ అయినట్లు భారీగా ఫిర్యాదు నమోదు చేసిన యూజర్లు.!

Claude AI Down: సర్వీస్ పూర్తిగా డౌన్ అయినట్లు భారీగా ఫిర్యాదు నమోదు చేసిన యూజర్లు.!

Claude AI Down: ప్రపంచ ప్రముఖ AI చాట్‌ బాట్‌ లలో ఒకటైన క్లాడే AI సర్వీస్ లో అతిపెద్ద అంతరాయం ఏర్పడినట్లు వేలాది మంది వినియోగదారులు రిపోర్ట్ చేశారు. ప్రముఖ AI సంస్థ Anthropic అభివృద్ధి చేసిన క్లాడే AI సేవలు సరిగా పనిచేయకపోవడం తో యూజర్లు సోషల్ మీడియా మరియు Downdetector ప్లాట్‌ ఫారమ్‌ ను ఆశ్రయించారు. అంటే, ఈ ప్లాట్ ఫామ్స్ ద్వారా తమ సమస్య గురించి రిపోర్ట్ మరియు పోస్ట్ లు అందించారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Claude AI Down: ఫిర్యాదుల వెల్లువ

క్లాడే AI సర్వీస్ అనుకోకుండా సడన్ గా డౌన్ అయినట్లు గుర్తించిన యూజర్లు అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌ సైట్ Downdetector పై రిపోర్ట్స్ అందించారు. ఈ`దీని ప్రకారం, క్లాడే AI సంబంధిత సమస్య పై వేల మంది వినియోగదారులు నివేదికలు అందించారు మరియు ఒక్కసారిగా రిపోర్ట్ బాగా పెరిగాయి. కేవలం నిమిషాల్లోనే రెండు వేలకు పైగా ఫిర్యాదులు నమోదైనట్లు ఈ ప్లాట్ ఫామ్ తెలిపింది. ముఖ్యంగా క్లాడే చాట్, క్లాడే కోడ్, API సేవలు, లాగిన్ వ్యవస్థ మరియు వెబ్‌ సైట్ యాక్సెస్‌ లో సమస్యలు ఎదురైనట్లు వినియోగదారులు పేర్కొన్నారు. యూజర్ రిపోర్ట్ చేసిన సమస్యల లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

  • Internal Server Error మెసేజెస్ రావడం
  • లాగిన్ కావడం లో ఇబ్బందులు
  • ఆలస్యంగా రెస్పాన్స్ రావడం
  • క్లాడే కోడ్ సేవలు పనిచేయకపోవడం
  • API అభ్యర్థనలు విఫలమవడం

వంటి సమస్యల గురించి యూజర్లు ఎక్కువగా రిపోర్ట్ అందించారు.డౌన్ డిటెక్టర్ లో అనేక మంది యూజర్లు ‘సర్వర్ డౌన్ అయ్యిందా’ అని ప్రశ్నిస్తూ కామెంట్ కూడా పోస్ట్ చేశారు. అయితే, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’ లో మాత్రం యూజర్లు చిత్ర విచిత్రమైన మరియు ఫన్నీ పోస్ట్ లను ఈ సర్వీస్ డౌన్ గురించి పోస్ట్ చేస్తున్నారు.

Claude AI Down

Anthropic స్పందన ఏమిటి?

గత కొన్ని రోజులుగా క్లాడే సొన్నెట్ మరియు క్లాడే ఓపస్ మోడళ్లలో “Elevated Errors” నమోదైనట్లు అధికారిక స్టేటస్ పేజీ రిపోర్ట్ చేసినట్లు వార్తలు చెబుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన తర్వాత ఇంజనీరింగ్ బృందం పరిష్కార చర్యలు చేపట్టి సేవలు త్వరితగతిన పునరుద్ధరించినట్లు కంపెనీ వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile