Tecno Camon 30 Premier 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ అనౌన్స్ చేసింది. వాస్తవానికి, Camon 30 సిరీస్ నుంచి రెండు ఫోన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ ఫోన్ డిజైన్ మరియు కెమెరా ఫీచర్స్ తో టీజింగ్ ను మాత్రం అందించింది. టెక్నో ఈ అప్ కమింగ్ ఫోన్ ను 60X Zoom కెమెరా తో తీసుకువస్తున్నట్లు గొప్పగా చెబుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Tecno Camon 30 Premier 5G
ఈ అప్ కమింగ్ టెక్నో స్మార్ట్ ఫోన్ ని మోడరన్ ఆర్ట్ సైడ్ యాక్సిస్ డిజైన్ తో అందిస్తున్నట్లు టెక్నో చెబుతోంది. ఇది కెమెరా మాదిరిగా పట్టుకోవడానికి మరియు స్టన్నింగ్ ఫోటోలను మరియు వీడియోలను షూట్ చేయడానికి అనువైనదిగా చెబుతోంది.
ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ సెటప్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సెటప్ లో 50MP Sony IMX890 మెయిన్ కెమెరా ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది. అంతేకాదు, ఇందులో 60X డిజిటల్ జూమ్ లేదా 3X ఆప్టికల్ జూమ్ అందించే 50MP 70mm పెరిస్కోప్ కెమెరా ఉన్నట్లు కూడా టీజర్ ద్వారా తెలిపింది. ఈ కెమెరా OIS సపోర్ట్ తో అల్ట్రా స్టడీ వీడియోలు మరియు స్టన్నింగ్ డిటైల్స్ తో ఫోటోలు అందిస్తుందని కూడా చెబుతోంది.
అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP ఆటో ఫోకస్ (AF) సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో అందించిన ఇన్ బిల్ట్ AIGC Portrait ఫీచర్ తో ప్రత్యేకమైన మరియు ఇష్టమైన పోర్ట్రైట్ లను షూట్ చేసుకోవచ్చని కూడా టెక్నో చెబుతోంది. ఇందులో AI జనరేటివ్ తో 480 వరకు పోర్ట్రైట్ మోడల్స్ ఉన్నట్లు కూడా తెలిపింది.
ఇక ఈ ఫోన్ డిజైన్ పరంగా, వెనుక లెథర్ బ్యాక్ డిజైన్ తో కనిపిస్తోంది. వాస్తవానికి టెక్నో కెమాన్ 30 ప్రీమియర్ 5జి స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో ఇప్పటికే లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ గోప్ప ఫీచర్స్ తో గ్లోబల్ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ ను కూడా అందుకుంది.