ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Zebronics చవక ధరలో కొత్త 100Hz 24 ఇంచ్ FHD Monitor ని లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ మోనిటర్ ని టీవీ మరియు కంప్యూటర్ మోనిటర్ లాగా ఉపయోగపడేలా ఫీచర్స్ కలిగి వుంది. ఈ మోనిటర్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ తో Flipkart టీజింగ్ చేస్తోంది. ఈ మోనిటర్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Zebronics 100Hz 24 ఇంచ్ FHD Monitor
ప్రముఖ ఇండియన్ బ్రాండ్ జీబ్రానిక్స్ బ్రాండ్ నుండి కొత్త మోనిటర్ గొప్ప ఫీచర్స్ తో వస్తోంది. అదే Zebronics EA124 24 ఇంచ్ FHD LED మోనిటర్. ఈ కొత్త మోనిటర్ ని మే 25వ తేదీ మార్కెట్లో విడుదల చేస్తోంది. అయితే, లాంచ్ కంటే ముందే ఈ మోనిటర్ యొక్క స్పెక్స్, ఫీచర్లు మరియు రేటును కూడా జీబ్రానిక్స్ బయట పెట్టింది.
ఈ మోనిటర్ ని కేవలం రూ. 6,999 రూపాయల ధరతో విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మోనిటర్ లాంచ్ అయిన వెంటనే అదే రోజు నుండి సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుందని బావిస్తున్నారు.
జీబ్రానిక్స్ ఈ మోనిటర్ చాలా అందమైన కలర్ మరియు స్లీక్ డిజైన్ తో అందిస్తోంది. ఈ మోనిటర్ మెటల్ స్టాండ్ తో మరియు వాల్ మౌంట్ అటాచ్ మెంట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. అంటే, ఈ మోనిటర్ ను డెస్క్ పైన లేదా గోడకు కూడా తగిలించుకోవచ్చు.
Zebronics 100Hz 24 inch FHD LED Monitor
ఈ మోనిటర్ లో ఇన్ బిల్ట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ మోనిటర్ 250 నిట్స్ బ్రైట్నెస్ మరియు 16.7 మిలియన్ కలర్ సపోర్ట్ తో ఉంటుందని కూడా జీబ్రానిక్స్ తెలిపింది. కనెక్టివిటీ పరంగా, ఈ మోనిటర్ లో HMDI, VGA మరియు 3.5mm ఆడియో జాక్ కూడా వుంది.
ముఖ్యంగా ఈ మోనిటర్ సాధారణ మోనిటర్స్ మాదిరిగా 60Hz రిఫ్రెష్ రేట్ కాకుండా కాకుండా 100Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది.