ఇండియాలో 4,590 rs కు సామ్సంగ్ నుండి Z2 ఫోన్ లాంచ్

ఇండియాలో 4,590 rs కు సామ్సంగ్ నుండి Z2 ఫోన్ లాంచ్

సామ్సంగ్ కొత్తగా Tizen OS తో ఒక స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది ఇండియాలో. Tizen అనేది సామ్సంగ్ యొక్క సొంత ఆపరేటింగ్ సిస్టం. ఫోన్ పేరు సామ్సంగ్ Z2.

దీని ప్రైస్ 4,590 రూ. ఆగస్ట్ 29 నుండి Paytm లో అందుబాటులో ఉంటుంది. త్వరలోనే బయట ఆఫ్ లైన్ సామ్సంగ్ రిటైల్ స్టోర్స్ లో కూడా ఉంటుంది.

ఫోన్ తో పాటు రిలయన్స్ Jio సిమ్ కూడా వస్తుంది ఫ్రీ గా. స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో… 4 in WVGA TFT డిస్ప్లే, 1.3Ghz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB ర్యామ్.

1500 mah బ్యాటరీ, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB అదనపు స్టోరేజ్ SD కార్డ్ సపోర్ట్, 5MP ప్రైమరీ కెమెరా, VGA ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇంకా ఫోన్ లో S Bike మోడ్, అల్ట్రా డేటా సేవింగ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఈ డిఫరెంట్ OS అండ్ బేసిక్ స్పెక్స్ ఫోన్ పై మీ అభిప్రాయం ఏంటి? ఆండ్రాయిడ్ మంచి OS అయినప్పటికీ,  కాని డిఫరెంట్ OS ను కూడా ఆహ్వానించ వలసిన అవసరం లేదా? ఫేస్ బుక్ కామెంట్స్ లో దీనిపై మీ అభిప్రాయం తెలపండి.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo