Samsung Galaxy S25 Ultra deal announced as amazon great freedom big deal
Samsung Galaxy S25 Ultra స్మార్ట్ ఫోన్ అమెజాన్ యొక్క లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ గా మార్కెట్లో మంచి పేరు మరియు గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా ఫీచర్స్ మరియు డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చాలా ప్రీమియం ధరలో ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ని చాలా తక్కువ ధరలో అందుకోవచ్చని అమెజాన్ ఈరోజు ఈ బిగ్ డీల్ రిలీజ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ.1,29,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, రేపటి నుంచి మొదలయ్యే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ రూ. 40,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 89,999 ఆఫర్ ధరలో లభిస్తుందని అమెజాన్ తెలిపింది. ఈ ఫోన్ అందించిన అన్ని ఆఫర్స్ తో ఏ ఫోన్ ఈ ధరలో లభిస్తుందని అమెజాన్ తెలిపింది. ఈ ఫోన్ ను కొనాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప సదవకాశం అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు S pen సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.9 అంగుళాల బిగ్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది QHD+ (3120 × 1440) రిజల్యూషన్, 1Hz–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్స్ బ్రైట్‌నెస్ తో పాటు గొరిల్లా గ్లాస్ ఆర్మోర్ 2 గ్లాస్ రక్షణ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.
శాంసంగ్ ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Elite చిప్ సెట్, 12GB ర్యామ్ మరియు 256GB / 512GB / 1TB స్టోరేజ్ ఆప్షన్స్ తో అందించింది. ఇది 3nm టెక్నాలజీ తో వచ్చే చిప్ సెట్ మరియు వేగవంతమైన పెర్ఫార్మెన్స్ మరియు AI సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మీకు అల్ట్రా పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఇక కెమెరా విభాగానికి వస్తే, ఇందులో 200MP ప్రధాన కెమెరా (OIS), 50MP అల్ట్రా వైడ్ , 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో (OIS) మరియు 10MP 3x టెలిఫోటో (OIS) కెమెరాతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో పాటు ముందు 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ మరియు 4K 60 FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో AI వీడియో అండ్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్ మరియు జబర్దస్త్ AI కెమెరా ఫీచర్స్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read : Virtual Surround vs True Dolby Atmos: ఏది బెస్ట్ మరియు ఏది మంచి సౌండ్ అందిస్తుంది.!
ఇందులో 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా శాంసంగ్ అందించింది. ఈ ఫోన్ లో అల్ట్రా సోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది మరియు ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ గా కూడా ఉంటుంది.