Virtual Surround vs True Dolby Atmos: ఏది బెస్ట్ మరియు ఏది మంచి సౌండ్ అందిస్తుంది.!
Virtual Surround vs True Dolby Atmos ఏది బెస్ట్ సౌండ్ అందిస్తుంది
చాలా మంది ఈ రెండు టెక్నాలజీలు కూడా ఒకటేనని అనుకుంటారు
వర్చువల్ సరౌండ్ సౌండ్ మరియు ట్రూ డాల్బీ అట్మోస్ మధ్య చాలా తేడా ఉంది
Virtual Surround vs True Dolby Atmos: వర్చువల్ సరౌండ్ మరియు ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ లలో ఏది బెస్ట్ మరియు ఏది మంచి సౌండ్ అందిస్తుంది, అని చాలా మంది తెలుసుకోవాలని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే, టీవీ, సౌండ్‌బార్ లేదా హోమ్ థియేటర్ కొనుగోలు చేసే సమయంలో “డాల్బీ అట్మోస్” మరియు “వర్చువల్ సరౌండ్ సౌండ్” మరియు “3D Audio” వంటి పదాలు తరచూ కనిపిస్తుంటాయి. వీటిలో బెటర్ సౌండ్ అందించే టెక్ ఏది అని తెలుసుకోవాలని అనుకోవడమే ఇందుకు కారణంగా చెబుతారు. అందుకే, ఈరోజు ఈ రెండు సౌండ్ టెక్ లలో ఉన్న తేడా మరియు వీటిలో ఏది బెటర్ సౌండ్ అందిస్తుందో వివరంగా తెలుసుకుందాం.
SurveyVirtual Surround vs True Dolby Atmos: రెండు ఒకటేనా?
చాలా మంది ఈ రెండు టెక్నాలజీలు కూడా ఒకటేనని అనుకుంటారు. కానీ, నిజానికి వర్చువల్ సరౌండ్ సౌండ్ మరియు ట్రూ డాల్బీ అట్మోస్ మధ్య చాలా తేడా ఉంది. అందుకే, అసలు ఈ రెండింటిలో ఏది ఎలా పనిచేస్తుంది, ఏది మంచి అనుభవాన్ని ఇస్తుంది మరియు మీకు ఏది బాగా సరిపోతుందో క్లియర్ గా చూద్దాం.
వర్చువల్ సరౌండ్ అంటే ఏమిటి?
వర్చువల్ సరౌండ్ సౌండ్ అనేది సాఫ్ట్‌వేర్ మరియు DSP (Digital Signal Processing) ఆధారంగా పనిచేసే ఆడియో టెక్నాలజీ. ఇందులో రెండు లేదా తక్కువ స్పీకర్ సెటప్ ఉన్నా కూడా శబ్దం అన్ని వైపుల నుంచి వస్తున్నట్లు ఒక భ్రమను సృష్టిస్తుంది.

ఉదాహరణకు ఈ టెక్ ఉన్న టీవీలో రెండు స్పీకర్లు మాత్రమే ఉన్నా కూడా హెలికాప్టర్ తలపై నుంచి వెళ్తున్నట్లు లేదా కారు వెనుక నుంచి వస్తున్నట్లు వినిపించేలా ఆడియోను ప్రాసెస్ చేస్తుంది. అయితే, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేమిటంటే, ఇందులో నిజమైన 360° సౌండ్ అనుభవం ఉండదు. అలాగే, పై నుంచి వచ్చే శబ్దాలు అంత సహజంగా వినిపించవు. అంతేకాదు, పెద్ద గదుల్లో ఈ సౌండ్ ప్రభావం బాగా తగ్గుతుంది.
వర్చువల్ సరౌండ్ ప్రయోజనాలు
- ఇది చాలా తక్కువ ధరలో లభిస్తుంది.
- ఇందులో అదనపు స్పీకర్ అవసరం ఉండదు.
- ఇది చిన్న గదులు ఉన్న వారికి సరిపోతుంది.
- సినిమాలు, యూట్యూబ్, సాధారణ వినియోగంలో మంచి అనుభవం ఇస్తుంది.
ట్రూ డాల్బీ అట్మోస్ అంటే ఏమిటి?
డాల్బీ అట్మోస్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతన ఆడియో ఫార్మాట్లలో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో ప్రతి శబ్దాన్ని ఒక ప్రత్యేక ఆడియో ఆబ్జెక్ట్ గా ప్రాసెస్ చేస్తారు. దీంతో సౌండ్ ముందు, వెనుక, ఎడమ, కుడి మాత్రమే కాకుండా పై నుంచి కూడా వస్తున్నట్టు రియల్ ఫీల్ అందిస్తుంది.

అయితే, ఈ సౌండ్ ను పూర్తిగా ఆస్వాదించాలంటే, ప్రత్యేక అట్మోస్ స్పీకర్లు లేదా పైకి శబ్దాన్ని వెదజల్లే (Up-firing) స్పీకర్ అవసరం. అలాగే అట్మోస్ కు సపోర్ట్ చేసే కంటెంట్ కూడా ఉండాలి. అయితే, ఇది ఖర్చుతో కూడుకున్న ఆప్షన్ అవుతుంది.
డాల్బీ అట్మోస్ ప్రయోజనాలు
- నిజమైన 3D Surround Sound అనుభవం అందిస్తుంది.
- పై నుంచి వచ్చే శబ్దాలు చాలా స్పష్టంగా మరియు రియల్ గా ఉన్నట్లు వినిపిస్తాయి.
- సినిమాలు, గేమింగ్ మరియు మ్యూజిక్ లో అద్భుతమైన ఇమ్మర్షన్.
- పెద్ద గదుల్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
Also Read : iQOO Z11 : ప్రీమియం డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ ప్రకటించిన ఐకూ.!
ఎవరు ఏది కొనాలి?
మీ బడ్జెట్ బడ్జెట్ రూ. 10,000 లోపు అయితే వర్చువల్ సరౌండ్ ఉన్న మంచి సౌండ్‌బార్ సరిపోతుంది. అదే మీ బడ్జెట్ రూ. 15,000 నుంచి రూ. 50,000 ఉంటే డాల్బీ అట్మోస్ సౌండ్‌బార్ తీసుకుంటే మంచిది.
ఇంకా క్లియర్ గా ఒక్కమాటలో చెప్పాలంటే, నిజమైన హోమ్ థియేటర్ అనుభవం కావాలంటే ట్రూ డాల్బీ అట్మోస్ టెక్ ఎంచుకోవడం చాలా ఉత్తమం.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
