శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 ప్రీ-రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఇప్పుడు ఇండియాలో

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 ప్రీ-రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఇప్పుడు ఇండియాలో
HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నవారు శామ్సంగ్ భారతదేశ వెబ్సైట్ లో ప్రీ-రిజిస్ట్రేషన్స్ లో ముందుగా నమోదు చేయవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 చివరకు అధికారికంగా ప్రకటిచబడింది మరియు త్వరలోనే భారతీయ తీరప్రాంతాల్లోకి వెళ్లనుందని  మనకు అర్ధమయితుంది, ఎందుకంటే కంపెనీ ఇప్పటికే దేశంలో ప్రీ-రిజిస్ట్రేషన్ ని ప్రారంభించింది. భారతదేశం లో గెలాక్సీ నోట్ 9 యొక్క విడుదల కోసం తేదీ ఇంకా స్పష్టమవలేదు, కానీ వచ్చేవారంతం లోపు దీనికి సంభందించి కొత్త అప్డేట్ శామ్సంగ్ విడుదల చేయవచ్చని మేము ఆశిస్తున్నాము మరియు యూ ఎస్ లో ఆగష్టు 24 తారీఖు నుండి అందుబాటులోకి రానుంది కాబట్టి దాని తర్వాత అతి కొద్దీ కాలంలోనే ఇది ఇండియా లో కూడా అందు బాటులోకి రావచ్చని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. గెలాక్సీ నోటో 9 డివైజ్ ని కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నవారు శామ్సంగ్ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్లి వారి ఆసక్తిని ముందుగా నమోదు చేసుకోవచ్చు. గెలాక్సీ నోట్9 కోసం ప్రీ-రిజిస్ట్రేషన్స్ కోసం మీ ఫోన్ నంబర్ మరియు మీ ఇమెయిల్ అడ్రస్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని అందించాల్సి  ఉంటుంది. ఈ విధంగా నమోదుచేసిన వారికి గెలాక్సీ నోట్ 9 ఇండియా లాంచ్ సమయంలో మీకు సకాలంలో అప్డేట్ సమాచారం లభిస్తాయని నిర్ధారిస్తుంది, కనుక కొత్తగా ప్రారంభించిన స్మార్ట్ఫోన్ల ను  సొంతం చేసుకునే మొదటి వ్యక్తుల్లో మీరు ఒకరు కావచ్చు. ఈ ఫోన్ ని సొంతం చేసికోడానికి ప్రీ – రిజిస్ట్రేషన్ బటన్ ని నొక్కేముందుగా ఈ ఫోన్ ఏమేమి   స్పెక్స్ కలిగి ఉందొ ముందుంచుతున్నాము.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్:

ఈ శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 2960 X 1440 రెజల్యూషన్ తో కూడిన ఒక 6. 4-అంగుళాల క్వాడ్ హెచ్ డి+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే కలిగి వుంది. ఇంకా ఇది శామ్సంగ్ యొక్క అత్యంత ప్రజాధారణ పొందిన ఇన్ఫినిటీ డిస్ప్లేతో పాటుగా,డాల్బీ అట్మోస్(Dolby Atmos)  కి సపోర్ట్ చేయగల AKG చే ట్యూన్ చేయబడిన స్టీరియో స్పీకర్లు దీనిలో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 శక్తి తో పనిచేసే 10 nm  64-బిట్ ఆక్టా – కోర్ ప్రొసెసర్ ని అమర్చారు ఇంకా ఇది ఆండ్రాయిడ్ ఓరెయో 8.1 తో పనిచేస్తుంది. యూ ఎస్ లో మాత్రం శామ్సంగ్ తన సొంత చిప్సెట్ అయిన ఎక్సినోస్ 9810 చిప్సెట్ తో అందింస్తుందని అంచన కానీ యూ ఎస్ కి బయట అంటే ఇండియాలాంటి  దేశాలలో ఈ అవకాశం లేదు. ఈ స్మార్ట్ ఫోన్లో శామ్సంగ్ వాటర్ కార్బన్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించి  గ్రాఫిక్ ఇంటెన్సివ్ టాస్క్ చేస్తున్నపుడు ఫోన్ ని   చల్లబరుస్తుంది. క్వాల్కమ్ యొక్క 3 వ జనరేషన్ హెక్సాగాన్  685 DSP తో  శక్తివంతమైన మరియు స్థిరమైన పనితీరును అందించటానికి ఈ పరికరంలో AI- ఆధారిత పనితీరు అల్గోరిథంను సర్దుబాటు చేస్తుంది.

గెలాక్సీ నోట్ 9  4000mAh శక్తిగల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది, వినియోగదారులకు ఇది రోజువారీ శక్తిని అందిస్తాయి అని కంపెనీ వాదనలు. ఫోన్ రెండు వేరియంట్లలో  6జీబీ  ర్యామ్ + 128జీబీ  స్టోరేజి మరియు 8జీబీ ర్యామ్ + 512జీబీ  స్టోరేజి తో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫాబ్లేట్ వేరియంట్లు కూడా ఒక 512జీబీ  మైక్రో SD కార్డ్ కి మద్దతునందిస్తుంది.

దీని ఫోటోగ్రఫీ గురించే చేస్తే గనక, గెలాక్సీ నోట్ 9 డ్యూయల్ OIS తో వెనుక భాగంలో  డ్యూయల్ – కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. వైడ్ – యాంగిల్   మరియు టెలిఫోటో లెన్స్ రెండింటికి  కూడా 12ఎంపీ సెన్సార్ ఉంటుంది. వైడ్-యాంగిల్ సెన్సార్ F1.5 / F2.4 వేరియబుల్ ఎపర్చరు మరియు టెలిఫోటో లెన్స్ F2.4 F- స్పాట్ కలిగి ఉంది. ముందు కెమెరా F1.7 ఎపర్చరుతో 8ఎంపీ సెన్సార్ ని కలిగి ఉంది.

S- పెన్ కూడా బ్లూ టూత్  మద్దతుతో అప్గ్రేడ్ చేయబడింది కాబట్టి వినియోగదారులు స్టైలెస్ పైన ఒక బటన్ను క్లిక్ చేసి, సెల్ఫీ , గ్రూప్  ఫోటోలు, ప్రజంట్ స్లైడ్లు, విరామం మరియు ప్లే మ్యూజిక్ లాంటి  చాలావాటిని  తీసుకోవచ్చు. ఇన్ని ఫీచర్స్ వున్నా  గెలాక్సీనోట్ 9 ని మీరు పొందటానికి ప్రీ – రిజిస్ట్రేషన్ ఒక వెసులు బాటుగా ఉంటుంది . 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo