Samsung Galaxy M35 5G: శాంసంగ్ కొత్త ఫోన్ గ్రాండ్ ఎంట్రీ..ధర ఎంతంటే.!
Samsung Galaxy M35 5G ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది.
ఈ ఫోన్ ను 20 వేల ఉప బడ్జెట్ లో గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్ తో వచ్చింది
50MP OIS కెమెరా మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది
Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది. ఈ ఫోన్ ను 20 వేల ఉప బడ్జెట్ లో గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్, 50MP OIS కెమెరా మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది. ప్రైమ్ నుండి సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా శామ్సంగ్ అందించింది.
SurveySamsung Galaxy M35 5G: ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి స్మార్ట్ ఫోన్ ను గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో 6.6 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు కార్నింగ్ గొరిల్లా Glass Victus రక్షణ తో ఉంటుంది. ఈ ఫోన్ Exynos 1380 5జి ప్రోసెసర్ మరియు 8GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం సింగల్ ర్యామ్ తో వస్తుంది. కానీ, 128GB మరియు 256GB రెండు స్టోరేజ్ ఆప్షన్ లు ఉన్నాయి.

శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి ఫోన్ లో వెనుక 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా OIS సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ కెమెరాతో 30 fps వద్ద 4K UHD వీడియో లను మరియు గొప్ప నైట్ ఫోటోలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ ను 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000mAh హెవీ బ్యాటరీతో అందించింది. ఈ ఫోన్ 4 ప్రధాన OS అప్గ్రేడ్ లను మరియు 5 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుందని శామ్సంగ్ తెలిపింది.
Also Read: బడ్జెట్ ధరలో హైబ్రిడ్ ANC తో OnePlus Nord Buds 3 Pro బడ్స్ లాంచ్ చేసిన వన్ ప్లస్.!
Samsung Galaxy M35 5G: ప్రైస్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 35 5జి బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి రూ. 16,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ తో ICICI మరియు SBI కార్డ్స్ 10% డిస్కౌంట్ ఆఫర్ ను శామ్సంగ్ జత చేసింది. ఈ ఫోన్ జూలై 20 వ తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
