బడ్జెట్ ధరలో హైబ్రిడ్ ANC తో OnePlus Nord Buds 3 Pro బడ్స్ లాంచ్ చేసిన వన్ ప్లస్.!

HIGHLIGHTS

ట్రెండీ ఫీచర్స్ మరియు స్టైలిష్ డిజైన్ తో OnePlus Nord Buds 3 Pro బడ్స్ లాంచ్

ఈ బడ్స్ ను రెండు అందమైన కలర్ ఆప్షన్స్ మరియు ఇతర ఫీచర్స్ తో ప్రవేశపెట్టింది

హైబ్రిడ్ ANC తో OnePlus Nord Buds 3 Pro బడ్స్ లాంచ్ చేసింది

బడ్జెట్ ధరలో హైబ్రిడ్ ANC తో OnePlus Nord Buds 3 Pro బడ్స్ లాంచ్ చేసిన వన్ ప్లస్.!

నిన్న జరిగిన వన్ ప్లస్ మెగా ఈవెంట్ నుంచి బడ్జెట్ ధరలో హైబ్రిడ్ ANC తో OnePlus Nord Buds 3 Pro బడ్స్ లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న చాలా ట్రెండీ ఫీచర్స్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఈ బడ్స్ ను విడుదల చేసింది. ఈ బడ్స్ ను రెండు అందమైన కలర్ ఆప్షన్స్ మరియు ఇతర ఫీచర్స్ తో ప్రవేశపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord Buds 3 Pro: ప్రైస్

వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్ ను రూ. 3,299 ధరతో భారత మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ బడ్స్ ను ICICI మరియు OneCard క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి రూ. 300 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బడ్స్ జూలై 20 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ ను అమెజాన్ ఇండియా మరియు వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Also Read: OnePlus Pad 2: 3K డిస్ప్లే మరియు 12GB ర్యామ్ తో లాంచ్ అయ్యింది.!

OnePlus Nord Buds 3 Pro: ఫీచర్లు

వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్ సాఫ్ట్ జేడ్ మరియు స్టార్రి బ్లాక్ రెండు కలర్ లలో అందించింది. ఈ బడ్స్ AAC మరియు SBC సపోర్ట్ వస్తాయి మరియు హైబ్రిడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ తో ఉంటాయి. ఈ బడ్స్ ను గొప్ప బాస్ సౌండ్ అందించే 12.4 టైటానైజ్డ్ డైఫాగ్రామ్ తో అందించింది. ఇది Bass Wave 2.0 ఫీచర్ తో రిచ్ బాస్ అందిస్తుంది.

OnePlus Nord Buds 3 Pro
OnePlus Nord Buds 3 Pro

ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ ANC off పైన టోటల్ 44 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. అయితే, ANC On చేసినప్పుడు ఓవరాల్ 20 గంటల ప్లే టైం అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ లో కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కలిగిన 3-mic సిస్టం వుంది. అలాగే, ఈ బడ్స్ టైప్ C ఛార్జ్ పోర్ట్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లను కలిగి వుంది. వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో లేటెస్ట్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ వస్తుంది మరియు అంతరాయం లేని కనెక్టివిటీ అందిస్తుంది.

ఈ వన్ ప్లస్ కొత్త బడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్ మరియు డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్ లను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo