OnePlus Pad 2: 3K డిస్ప్లే మరియు 12GB ర్యామ్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ కొత్త OnePlus Pad 2 ను విడుదల చేసింది.

3K డిస్ప్లే మరియు 12GB ర్యామ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది

వన్ ప్లస్ ప్యాడ్ 2 ని పెద్ద 12.1 ఇంచ్ 3K స్క్రీన్ తో మార్కెట్ లో ప్రవేశపెట్టింది

OnePlus Pad 2: 3K డిస్ప్లే మరియు 12GB ర్యామ్ తో లాంచ్ అయ్యింది.!

OnePlus Pad 2: వన్ ప్లస్ కొత్త ప్యాడ్ 2 నోట్ ప్యాడ్ ను విడుదల చేసింది. ఈ కొత్త నోట్ ప్యాడ్ ను గొప్ప రిజల్యూషన్ కలిగిన 3K డిస్ప్లే మరియు 12GB ర్యామ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ప్యాడ్ పెద్ద స్క్రీన్ మరియు తగిన కెమెరా సెటప్ ను కూడా కలిగి వుంది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ నోట్ ప్యాడ్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు పైన ఒక లుక్కేద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Pad 2: ఫీచర్లు

వన్ ప్లస్ ప్యాడ్ 2 ని పెద్ద 12.1 ఇంచ్ స్క్రీన్ తో మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ స్క్రీన్ 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 3K రిజల్యూషన్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్యాడ్ Dolby Vision సపోర్ట్ తో వస్తుంది కాబట్టి గొప్ప విజువల్స్ ను కూడా అందిస్తుంది.

OnePlus Pad 2
OnePlus Pad 2

ఈ వన్ ప్లస్ నోట్ ప్యాడ్ ను కటింగ్ ఎడ్జ్ చిప్ సెట్ Snapdragon 8 Gen 3 తో అందించింది. ఇది 3.3GHz క్లాక్ స్పీడ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు AI సపోర్ట్ తో కూడా వస్తుంది. దానికి జతగా 8GB / 12GB LPDDR5x ర్యామ్ మరియు 128GB / 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ స్లీక్ డిజైన్ తో కంఫర్ట్ గా ఉంటుందని కూడా వన్ ప్లస్ తెలిపింది. అయితే, ఇది Wi-Fi పై మాత్రమే పని చేస్తుంది.

Also Read: OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది.!

ఈ నోట్ ప్యాడ్ లో వెనుక EIS సపోర్ట్ కలిగిన 13MP రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో మంచి సౌండ్ సపోర్ట్ కలిగిన క్వాడ్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ప్యాడ్ ఫేస్ అన్లాక్ తో వస్తుంది మరియు OxygenOS 14.1 పైన నడుస్తుంది. వన్ ప్లస్ ప్యాడ్ 2 లో హెవీ 9,510 mAh బ్యాటరీ ఉంది మరియు ఇది 67 సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.

OnePlus Pad 2: ప్రైస్

వన్ ప్లస్ ప్యాడ్ 2 (8GB + 128GB) వేరియంట్ ను రూ. 39,999 ధరతో, (12GB + 256GB) వేరియంట్ ను రూ. 42,999 ధరతో ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo