OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ మెగా ఈవెంట్ నుండి వన్ ప్లస్ నాలుగు కొత్త ప్రొడక్ట్స్ ను విడుదల చేసింది

OnePlus Nord 4 5G ను మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో తీసుకొచ్చింది

ఈ స్మార్ట్ ఫోన్ ఆక్వా టచ్ సపోర్ట్ కలిగిన 6.74 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వచ్చింది

OnePlus Nord 4 5G స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది.!

OnePlus Nord 4 5G: ఈరోజు జరిగిన వన్ ప్లస్ మెగా ఈవెంట్ నుండి వన్ ప్లస్ నాలుగు కొత్త ప్రొడక్ట్స్ ను విడుదల చేసింది. ఇందులో వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ కూడా వుంది. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో తీసుకొచ్చింది. ఈ ఫోన్ మెటల్ బాడీ, లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ ప్రోసెసర్, Sony కెమెరా సెటప్ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord 4 5G: ప్రైస్

వన్ ప్లస్ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను రూ. 32,999 రూపాయల ప్రారంభ ధర లో ప్రవేశపెట్టింది. ఈ ధరను 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించింది. హైఎండ్ వేరియంట్ ను 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ. 35,999 ధరతో అందించింది. ఈ ఫోన్ పైన గొప్ప ఆఫర్లు కూడా వన్ ప్లస్ అందించింది.

ఆఫర్స్ :

ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ICICI మరియు OneCard క్రెడిట్ కార్డు మరియు EMI తో వన్ ప్లస్ నార్డ్ 4 ఫోన్ ను కొనేవారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల No Cost EMI ఆఫర్ ను కూడా అందించింది. ఇది కాక జూలై 20 వ తేదీ 12 AM నుండి ప్రారంభమయ్యే Pre Order నుండి ఈ ఫోన్ బుక్ చేసే యూజర్లకు రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 20 వేలకే లభిస్తున్న పెద్ద QLED Smart Tv లు ఇవే.!

OnePlus Nord 4 5G: ఫీచర్లు

వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఆక్వా టచ్ సపోర్ట్ కలిగిన 6. 74 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వచ్చింది. ఈ డిస్ప్లే గరిష్టంగా 2,150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7+ Gen 3 5G చిప్ సెట్ తో తెచ్చింది. జతగా 8GB / 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.

OnePlus Nord 4 5G Features
OnePlus Nord 4 5G Features

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony మెయిన్ కెమెరా వుంది మరియు జతగా 8MP Sony అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాతో 60fps వద్ద 4K వీడియోలు మరియు ట్రూ లైఫ్ నేచురల్ ఫోటోలను షూట్ చేయవచ్చని వన్ ప్లస్ తెలిసింది. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.

ఈ ఫోన్ AI బెస్ట్ ఫేస్, AI క్లియర్ ఫేస్, AI ఆడియో సమరీ మరియు AI ఆర్టికల్ సమరీ అనే చాలా AI ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ను 5500mAh పెద్ద బ్యాటరీ మరియు 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo