Redmi Note 15 Pro : భారీ 200MP కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
రెడ్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నోట్ 15 ప్రో మోడల్ ను ఈరోజు షియోమీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
Redmi Note 15 Pro భారీ 200MP కెమెరా సెటప్ మరియు భారీ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, సిల్వర్ యాష్ మరియు మిరాజ్ బ్లూ మూడు రంగుల్లో అందించింది
Redmi Note 15 Pro: రెడ్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నోట్ 15 ప్రో మోడల్ ను ఈరోజు షియోమీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం మిడ్ రేంజ్ ధరలో భారీ 200MP కెమెరా సెటప్ మరియు భారీ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ అండ్ ఆఫర్స్ తెలుసుకోండి.
SurveyRedmi Note 15 Pro : ప్రైస్
రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ గురించి నిన్న మేము అందించిన లీక్స్ నిజం చేస్తూ, రూ. 29,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ (8 జీబీ + 128 జీబీ) బేసిక్ వేరియంట్ ను ఈ ప్రైస్ తో అందించింది. ఈ ఫోన్ రెండో వేరియంట్ (8 జీబీ + 256 జీబీ) ను కూడా కేవలం రూ. 31,999 ప్రైస్ తో అందించింది. ఈ ఫోన్ ప్రీ బుకింగ్ ముందు నుంచే స్టార్ట్ చేసింది. ఈ ప్రీ బుకింగ్స్ పై కూడా మంచి డీల్స్ అందించింది. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, సిల్వర్ యాష్ మరియు మిరాజ్ బ్లూ మూడు రంగుల్లో అందించింది.
ఆఫర్స్ :
ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను ICICI మరియు HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అయితే, ఈ కార్డ్స్ తో ఫుల్ స్వీప్ చేస్తే మాత్రం రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.
Redmi Note 15 Pro : ఫీచర్స్
రెడ్ మీ నోట్ 15 ప్రో ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కలిగిన 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంది. ఈ బిగ్ స్క్రీన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇదే కాదు, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, డాల్బీ విజన్ సపోర్ట్ మరియు HDR10+ సపోర్ట్ కూడా కలిగివుంది. ఈ షియోమీ కొత్త ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra (4nm) చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కూడా అందించింది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 200 MP ప్రధాన కెమెరా మరియు 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 20 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ కెమెరా 30FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ చేస్తుంది మరియు AI కెమెరా ఫీచర్స్ తో జతగా కూడా వస్తుంది. 6580 mAh బిగ్ బ్యాటరీ ఈ ఫోన్ లో వుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది. IP66, 68, 69 మరియు 69K రేటింగ్ కలిగిన ఈ ఫోన్ గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.
Also Read: Klipsch 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఏకంగా రూ. 10,000 డిస్కౌంట్ అందుకోండి.!
ఈ ఫోన్ లో 400% వాల్యూమ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను షియోమీ అందించింది. అంతేకాదు, డాల్బీ అట్మాస్ మరియు Hi Res ఆడియో సపోర్ట్ వంటి ప్రీమియం ఆడియో ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.