Redmi Note 15 5G : రెడ్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రెడ్మి 15 కొత్త అప్డేట్ ని ఈరోజు కంపెనీ విడుదల చేసింది. ముందుగా లాంచ్ గురించి మాత్రమే టీజర్ విడుదల చేసిన షియోమీ, ఈరోజు ఈ ఫోన్ కలిగిన కొన్ని ప్రత్యేకతలు కూడా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 4K వీడియో సపోర్ట్ కలిగిన 108MP కెమెరా సెటప్ తో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
Redmi Note 15 5G : కొత్త అప్డేట్ ఏమిటి?
రియల్ మీ నోట్ 15 ఇండియా లాంచ్ కోసం అమెజాన్ ప్లాట్ ఫామ్ నుంచి చేప్పట్టిన టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ ను 4K విదేవుడి సపోర్ట్ కలిగిన 108MP (OIS సపోర్ట్) మెయిన్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు ఈరోజు కొత్త టీజర్ అందించింది. ఇదే పేజీ నుంచి ఈ ఫోన్ ఇతర కెమెరా ఫీచర్స్ కూడా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ మల్టీ ఫోకల్ పోర్ట్రైట్ మరియు డైనమిక్ షాట్ వంటి కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుందని షియోమీ కన్ఫర్మ్ చేసింది.
ఈ అప్ కమింగ్ షియోమీ ఫోన్ లో భారీ 5,520 mAh బ్యాటరీ ఉన్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ కలిగిన ఈ బిగ్ బ్యాటరీతో 1.6 రోజులు యూసేజ్ అందిస్తుందట. ఈ ఫోన్ లో అందించిన బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.
ఇక ఈ ఫోన్ డిజైన్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక పెద్ద సర్కిల్ బంప్ ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా ఉండే అవకాశం ఉండవచ్చు. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు ఈ ఫోన్ లో ముందు కర్వుడ్ స్క్రీన్ ఉంటుంది. ఓవరాల్ గా ప్రస్తుతం కంపెనీ అందించిన వివరాల ద్వారా ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్, బిగ్ బ్యాటరీ మరియు స్టన్నింగ్ కెమెరా వంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని అర్ధం అవుతుంది.
షియోమీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ కోసం అమెజాన్ నుంచి అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ ఫీచర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేయడం మొదలు పెట్టింది.