Realme Narzo 90x 5G: సోనీ కెమెరా మరియు సూపర్ డిస్ప్లేతో వస్తుంది.!

HIGHLIGHTS

రియల్ మీ అప్ కమింగ్ బడ్జెట్ సిరీస్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసింది

ఈ ఫోన్ ఫీచర్స్ పై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు

ఈ ఫోన్ బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్స్ తో వచ్చే ఫోన్ అవుతుందని అంచనా వేస్తున్నారు

Realme Narzo 90x 5G: సోనీ కెమెరా మరియు సూపర్ డిస్ప్లేతో వస్తుంది.!

Realme Narzo 90x 5G: రియల్ మీ అప్ కమింగ్ బడ్జెట్ సిరీస్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసింది. ఈ ఫోన్ కీలక ఫీచర్స్ లో ఈ ఫోన్ కలిగిన డిజైన్, కెమెరా మరియు మరిన్ని వివరాలు ఉన్నాయి. ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ బడ్జెట్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాబట్టి ఈ ఫోన్ ఫీచర్స్ పై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు. అయితే, కంపెనీ రివీల్ చేసిన ఫీచర్స్ చూస్తుంటే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్స్ తో వచ్చే ఫోన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Narzo 90x 5G : ఫీచర్స్

రియల్ మీ నార్జో 90 ఎక్స్ స్మార్ట్ ఫోన్ వెనుక గ్రేడియంట్ చారలు కలిగిన సరికొత్త డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ తో ఫోన్ చూడటానికి కొత్తగా మరియు ఆకర్షణీయంగా ఉండేలా చేసింది. ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన గొప్ప డిస్ప్లేతో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ ఉన్నట్లు కూడా టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడించింది.

Realme Narzo 90x 5G

ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ ను చూస్తే, ఇందులో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP Sony మెయిన్ కెమెరా జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కూడా AI ఎడిట్ జీనీ మరియు AI ఎడిటర్ వంటి కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 400% భారీ సౌండ్ అందించే స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది.

ఇక ఈ ఫోన్ లో ప్రదమైన ఆకర్షణగా నిలిచే బ్యాటరీ కేటగిరికి వస్తే, ఈ ఫోన్ ను 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ మాత్రమే కాదు వేగవంతమైన 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది.

Also Read: BSNL: కేవలం రూ. 399 రూపాయలకే 3300 GB హై స్పీడ్ డేటా అందుకోండి.!

Realme Narzo 90x 5G : లాంచ్ డేట్

రియల్ మీ నార్జో 90 ఎక్స్ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు రియల్ మీ నార్జో 90 5జి స్మార్ట్ ఫోన్ కొద లాంచ్ అవుతుంది. ఈ రెండు ఫోన్స్ కూడా లాంచ్ అయిన తర్వాత అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo