BSNL: కేవలం రూ. 399 రూపాయలకే 3300 GB హై స్పీడ్ డేటా అందుకోండి.!

HIGHLIGHTS

దేశవ్యాప్తంగా ప్రజలకు ఉత్తమ సర్వీస్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు కొత్త ఆఫర్లు కూడా అందిస్తోంది

ముందుగా మొబైల్ నెట్‌వర్క్ పై దృష్టిపెట్టిన కంపెనీ ఇప్పుడు హోమ్ ఇంటర్నెట్ సర్వీస్ పై కూడా దృష్టి పెట్టింది

హోమ్ ఇంటర్నెట్ సర్వీస్ ను మరింతగా విస్తరించే దిశగా కొత్త ఆఫర్ కూడా విడుదల చేసింది

BSNL: కేవలం రూ. 399 రూపాయలకే 3300 GB హై స్పీడ్ డేటా అందుకోండి.!

BSNL: దేశవ్యాప్తంగా ప్రజలకు ఉత్తమ సర్వీస్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు కొత్త ఆఫర్లు కూడా అందిస్తోంది. ముందుగా మొబైల్ నెట్వర్క్ పై దృష్టిపెట్టిన కంపెనీ ఇప్పుడు హోమ్ ఇంటర్నెట్ సర్వీస్ పై కూడా దృష్టి పెట్టింది. హోమ్ ఇంటర్నెట్ సర్వీస్ ను మరింతగా విస్తరించే దిశగా కొత్త ఆఫర్ కూడా విడుదల చేసింది. ఈ ఆఫర్ తో కేవలం రూ. 399 రూపాయలకే 3300 GB హై స్పీడ్ డేటా మరియు ఒక నెల ఉచిత సర్వీస్ కూడా పొందవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL: ఏమిటి ఈ ఆఫర్?

దేశవ్యాప్తంగా ఫైబర్ సర్వీస్ ఆఫర్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్, ఇప్పుడు కొత్త యూజర్లను ఆకర్షించేందుకు ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఆఫర్ ఏమిటంటే, బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకునే వారికి ఈ ఆఫర్ అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్రకారం, కొత్త ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే వారికి రూ. 499 రూపాయల విలువైన మొదటి నెల సర్వీస్ ఉచితంగా అందిస్తుంది.

BSNL Fiber Plan Offer

అంతేకాదు, మొదటి మూడు నెలల రీఛార్జ్ పై రూ. 100 డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, రూ. 499 రూపాయల విలువైన బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ ప్లాన్ ను రూ. 339 రూపాయలకే అందుకోవచ్చు. మీరు ఈ ఆఫర్ అందుకోవాలనుకుంటే, మీ వాట్సాప్ నుంచి ‘1800-4444’ నెంబర్ కు జస్ట్ ‘Hi’ అని మెసేజ్ పెడితే సరిపోతుంది. మీకు వివరాలు మరియు కనెక్షన్ తీసుకోవడానికి మరియు మీ ఏరియా లో ఈ సర్వీస్ అందుబాటులో ఉందో లేదో కూడా వివరాలు అందిస్తుంది.

Also Read: సరికొత్త Luma Color Image తో రియల్ మీ 16 ప్రో సిరీస్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి.!

బీఎస్ఎన్ఎల్ రూ. 499 బేసిక్ ప్లాన్ అందించే లాభాలు ఏమిటి?

ఇక ఈ బేసిక్ ప్లాన్ తో వచ్చే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో నెల మొత్తానికి 3300GB హైస్పీడ్ డేటా యాక్సెస్ అందిస్తుంది. ఇది మీకు 30 Mbps నుంచి 60 Mbps స్పీడ్ తో వేగవంతమైన ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తుంది. ఈ ప్లాన్ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 4Mbps వేగంతో అన్లిమిటెడ్ డేట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ కూడా అందిస్తుంది.

అయితే, పైన తెలిపిన ప్లాన్ ప్రైస్ మరియు ఆఫర్ ప్రైస్ పైన GST అదనంగా చెల్లించాలి. ైట్ తక్కువ ఖర్చులో ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. ఒక వేళ అధిక డేటా మరియు OTT లాభాలు కూడా కోరుకుంటే మాత్రం బీఎస్ఎన్ఎల్ రూ. 599 బేసిక్ OTT ప్లాన్ ను చూడవచ్చు. ఈ ప్లాన్ 4000 GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. వీటితో పాటు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ హై స్పీడ్ లిమిట్ ముగిసిన తర్వాత 4 Mbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 75 Mbps వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo