సరికొత్త Luma Color Image తో రియల్ మీ 16 ప్రో సిరీస్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి.!
రియల్ మీ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ ఇండియాలో టీజింగ్ మొదలు పెట్టింది
ఈ అప్ సిరీస్ నుంచి రియల్ మీ 16 ప్రో మరియు రియల్ మీ 16 ప్రో ప్లస్ రెండు ఫోన్లు లాంచ్ అవుతున్నాయి
ప్రత్యేకమైన Luma Color Image ఫీచర్ గురించి కంపెనీ ఈరోజు టీజర్ విడుదల చేసింది
రియల్ మీ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ ఇండియాలో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ సిరీస్ నుంచి రియల్ మీ 16 ప్రో మరియు రియల్ మీ 16 ప్రో ప్లస్ రెండు ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్స్ లాంచ్ కోసం కీలక ఫీచర్స్ వెల్లడిస్తూ రియల్ మీ టీజింగ్ చేస్తోంది. ఈ సిరీస్ ఫోన్స్ కలిగిన ప్రత్యేకమైన Luma Color Image ఫీచర్ గురించి కంపెనీ ఈరోజు టీజర్ విడుదల చేసింది.
SurveyLuma Color Image : ఏమిటి ఈ కొత్త ఫీచర్?
రియల్ మీ అప్ కమింగ్ సిరీస్ ఫోన్లు గొప్ప కెమెరా సెటప్ తో వస్తాయని కంపెనీ ముందు నుంచే టీజింగ్ చేస్తోంది. వాస్తవానికి, రియల్ మీ నెంబర్ సిరీస్ లో ఎప్పటికప్పుడు కెమెరా పరంగా కొత్త ఫీచర్స్ మరియు మంచి కెమెరా సెటప్ అందిస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న కొత్త సిరీస్ ఫోన్స్ లో లుమా కలర్ ఇమేజ్ ఫీచర్ ను పరిచయం చేసినట్లు రియల్ మీ కొత్త టీజర్ నుంచి అనౌన్స్ చేసింది.
ఈ కొత్త ఫీచర్ గురించి చెప్పాలంటే, ఇది ఇప్పటికే DSLR కెమెరా మరియు కొన్ని ప్రీమియం మొబైల్స్ అందుబాటులో ఉన్న ఫీచర్ అనే చెప్పాలి. ఈ ఫీచర్ ఫోన్ కెమెరాతో తీసే ఇమేజ్ లను మరింత బ్రెట్ గా మరియు లోతైన షాడో తో చాలా డిటైల్స్ తో కలర్ ఫుల్ గా అందిస్తుంది. ఎందుకంటే, ఇది RGB కలర్స్ నుంచి బ్రైట్నెస్ తీసుకుంటుంది. అయితే, ఈ ఫీచర్ తో ఫోన్ అందించే ఫోటో మరియు వీడియో డీటెయిల్స్ గురించి కంపెనీ వివరంగా వెల్లడించే వరకు మనం ఈ ఫీచర్ గురించి పూర్తిగా చెప్పలేము.

ఈ ఫోన్ లో AI ఎడిట్ జీనీ 2.0 ఫీచర్ జత కలిగిన కెమెరా సిస్టం ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 1x నుంచి 10x వరకు గొప్ప వివరాలు అందించే సూపర్ పోర్ట్రైట్ ఫోటోలు అందిస్తుందని రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ రియల్ మీ UI 7.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది.
Also Read: 5.9mm స్లీక్ ఫోన్ Motorola Edge 70 ఎలాంటి ఫీచర్స్ తో వస్తుంది: అంచనా ఫీచర్స్ ఇవిగో.!
రియల్ మీ 16 ప్రో సిరీస్ లాంచ్ డేట్ అనౌన్స్ చేయకుండా, రియల్ మీ ఈ అప్ కమింగ్ సిరీస్ గురించి టీజింగ్ చేస్తోంది. వీటిలో రియల్ మీ 16 ప్రో ప్లస్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 6500 కంటే మరింత అధికమైన మరియు శక్తివంతమైన బ్యాటరీ ఉంటుందని కూడా రియల్ మీ చెబుతోంది.
ఈ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.