5.9mm స్లీక్ ఫోన్ Motorola Edge 70 ఎలాంటి ఫీచర్స్ తో వస్తుంది: అంచనా ఫీచర్స్ ఇవిగో.!
Motorola Edge 70 ఇండియాలో విడుదల కాబోతున్న మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 15వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది
ఇది కేవలం 5.9mm మందంతో అతి సన్నని ఫోనుగా వస్తుంది
Motorola Edge 70 స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల కాబోతున్న మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతుంది. వాస్తవానికి, ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో గత నెల చివరిలో లాంచ్ అయ్యింది మరియు ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ కి సిద్ధం అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే కంపెనీ అందించగా, గ్లోబల్ వేరియంట్ ను అనుసరించి ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ ఈరోజు మేము అందిస్తున్నాము.
SurveyMotorola Edge 70 : లాంచ్ డేట్
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 15వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్, మూడు కొత్త పాంటోన్ కలర్స్ తో మరియు టెక్స్చర్ ఫినిష్ తో ఇండియాలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ తన x అకౌంట్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ అందిస్తోంది.
Motorola Edge 70 : అంచనా ఫీచర్స్
ఈ మోటోరోలా ఎడ్జ్ సిరీస్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ 4,800 mAh బ్యాటరీతో వచ్చింది. అయితే ఇండియాలో మాత్రం 5000 mAh బ్యాటరీతో వస్తుందని కంపెనీ అనౌన్స్ చేసింది. ఇందులో 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫోన్ డిజైన్ పరంగా చాలా గొప్ప ఉంటుంది. ఎందుకంటే, ఇది కేవలం 5.9mm మందంతో అతి సన్నని ఫోనుగా వస్తుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుందని కూడా మోటోరోలా అనౌన్స్ చేసింది.

మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ను అనుసరించి ఈ అంచనా ఫీచర్స్ మేము మీకు అందిస్తున్నాము. ఈ ఫోన్ ఇండియాలో 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.67 ఇంచ్ pOLED స్క్రీన్ తో లాంచ్ అవకాశం ఉండవచ్చు. ఇక ఈ స్క్రీన్ ఇతర ఫీచర్స్ చూస్తే, ఇది 1.5K సూపర్ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఇదే కాదు ఈ ఫోన్ లో 12 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ వరకు స్టోరేజ్ ఉండే అవకాశం ఉంటుంది.
Also Read: 9.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై రూ.10,000 భారీ డిస్కౌంట్ కూపన్ అందించిన అమెజాన్.!
ఇక ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వేనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్ మరియు మరో కెమెరా ఉంటుంది. అయితే, ఇందులో 50MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంటుంది. ఎంధుకంటే, ఈ ఫోన్ ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ వస్తుందని కంపెనీ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
అయితే, ఇవన్నీ కూడా గ్లోబల్ వేరియంట్ మరియు కొత్తగా వచ్చిన లీక్స్ ద్వారా మనం అంచనా వేసిన ఫీచర్స్ మాత్రమే అని గమనించాలి.