Realme P4x 5G: 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Realme P4x 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ భారీ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ లో మరిన్ని గొప్ప ఫీచర్స్ కూడా రియల్ మీ అందించింది

Realme P4x 5G: 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Realme P4x 5G: స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. కేవలం బ్యాటరీ మాత్రమే కాదు ఈ ఫోన్ లో మరిన్ని గొప్ప ఫీచర్స్ కూడా రియల్ మీ అందించింది. భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో పెరిగిన భారీ పోటీకి మరింత పోటీగా ఈ ఫోన్ ను రియల్ మీ లాంచ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4x 5G: ప్రైస్

రియల్ మీ పి4x స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ను 15,499 ధరతో, మిడ్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను 16,999 ధరతో, మరియు హైఎండ్ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను 18,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మాట్టే సిల్వర్, లేక్ గ్రీన్ మరియు ఎలిగెంట్ పింక్ ముందు రంగుల్లో అందించింది.

సేల్ అండ్ ఆఫర్లు

రియల్ మీ పి4x స్మార్ట్ ఫోన్ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అయితే, ఈ ఫోన్ పై అందించిన బ్యాంక్ మరియు కూపన్ ఆఫర్ మొదటి సేల్ ఒక్కరోజు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ మరింత చవక ధరకు అందుకునే అవకాశం అందించింది. డిసెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ Flipkart మరియు రియల్ మీ అఫీషియల్ సైట్ నుంచి లభిస్తుంది.

Realme P4x 5G: ఫీచర్స్

రియల్ మీ ఈ ఫోన్ ను బడ్జెట్ యూజర్లను ఆకర్షించే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. పి4x స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra 5G చిప్ సెట్ తో నడుస్తుంది. ఈ ఫోన్లో 8 జీబీ ఫిజికల్ ర్యామ్ జతగా 10 జీబీ డైనమిక్ ర్యామ్ ఫీచర్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు గొప్ప స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది.

Realme P4x 5G

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ LCD స్క్రీన్ ను FHD + (1080 x 2400) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గరిష్టంగా 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో AF సపోర్ట్ కలిగిన 50MP EIS మెయిన్ కెమెరా జతగా 2MP IR లెన్స్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ కెమెరా 30FPS 4K వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: BSNL Best Plans: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సర కాలం అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తాయి.!

ఇక ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ చూస్తే, ఈ పి4x స్మార్ట్ ఫోన్ 7000 mAh భారీ టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ న యూ వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా రియల్ మీ అందించింది. IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo