Realme P4s launching with performance killer features in india
Realme P4s: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ మరియు భారీ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ కి సిద్దమయింది. ఈ ఫోన్ ను రియల్ మీ పి సిరీస్ నుంచి విడుదల చేస్తుంది మరియు ఇది కూడా జబర్దస్త్ బ్యాటరీ సెటప్ తో లాంచ్ అవుతుంది. రేపు లాంచ్ కాబోతున్న ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
రియల్ మీ పి4s స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ భాగస్వామ్యంతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
రియల్ మీ పి4s ఫోన్ ను భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ మరియు జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. రియల్ మీ ఇందులో మీడియా టెక్ Dimensity 7400 ప్రాసెసర్ మరియు హైపర్ విజన్ ప్లస్ AI డెడికేటెడ్ గేమింగ్ చిప్ రెండు చిప్ లను అందించింది. ఈ సెటప్ తో ఈ 144 FPS తో BGMI గేమింగ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో గొప్ప డిస్ప్లేని కూడా అందించింది.
ఈ ఫోన్ లో HDR 10+ సపోర్ట్ కలిగిన పెద్ద M14 డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కలిగిన ఈ డిస్ప్లే హై రిజల్యూషన్ కంటెంట్ మరియు గేమింగ్ కోసం చాలా చక్కగా సరిపోతుంది. ఈ ఫోన్ భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది మరియు ఇది 80w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: 55 QLED Smart Tv: ఈరోజు బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.!
ఇక కెమెరా విభాగానికి వస్తే. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా జతగా 8MP AI వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్ కలిగి మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సౌకర్యంతో తో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లంచ్ అవుతుంది కాబటి, ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుందో తెలుస్తుంది. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ లో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఈ విషయం కూడా తేలిపోతుంది.