Realme P4s: డ్యూయల్ చిప్ పవర్ తో రేపు లాంచ్ అవుతుంది.. ఫోన్ ఎలా ఉందంటే.!
యల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది
డ్యూయల్ చిప్ పవర్ మరియు భారీ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ కి సిద్దమయింది
రియల్ మీ పి4s ఫోన్ ను భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసిం
Realme P4s: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ మరియు భారీ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ కి సిద్దమయింది. ఈ ఫోన్ ను రియల్ మీ పి సిరీస్ నుంచి విడుదల చేస్తుంది మరియు ఇది కూడా జబర్దస్త్ బ్యాటరీ సెటప్ తో లాంచ్ అవుతుంది. రేపు లాంచ్ కాబోతున్న ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveyRealme P4s: లాంచ్ టైం
రియల్ మీ పి4s స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ భాగస్వామ్యంతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Realme P4s: ఫీచర్స్
రియల్ మీ పి4s ఫోన్ ను భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ మరియు జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. రియల్ మీ ఇందులో మీడియా టెక్ Dimensity 7400 ప్రాసెసర్ మరియు హైపర్ విజన్ ప్లస్ AI డెడికేటెడ్ గేమింగ్ చిప్ రెండు చిప్ లను అందించింది. ఈ సెటప్ తో ఈ 144 FPS తో BGMI గేమింగ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో గొప్ప డిస్ప్లేని కూడా అందించింది.

ఈ ఫోన్ లో HDR 10+ సపోర్ట్ కలిగిన పెద్ద M14 డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కలిగిన ఈ డిస్ప్లే హై రిజల్యూషన్ కంటెంట్ మరియు గేమింగ్ కోసం చాలా చక్కగా సరిపోతుంది. ఈ ఫోన్ భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది మరియు ఇది 80w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: 55 QLED Smart Tv: ఈరోజు బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.!
ఇక కెమెరా విభాగానికి వస్తే. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా జతగా 8MP AI వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్ కలిగి మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సౌకర్యంతో తో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లంచ్ అవుతుంది కాబటి, ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుందో తెలుస్తుంది. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ లో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఈ విషయం కూడా తేలిపోతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
