Realme launches Realme P4s 5G smartphone with 8000mAh battery in India Price sale specs
Realme P4s ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ బెస్ట్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు డ్యూయల్ చిప్ పవర్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ప్రస్తుతం నడుస్తున్న హైక్ రేటుకే విడుదల చేసింది. అయితే, తగిన ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఇది ఆకట్టుకునే డిజైన్ లో కూడా ఉంటుంది. ఈ లేటెస్ట్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
రియల్ మీ ఈ ఫోన్ ను మొత్తం మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరల లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ను టైటానియం గ్రే మరియు ఎలక్ట్రిక్ సియాన్ అనే రెండు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ కోసం గొప్ప లాంచ్ ఆఫర్స్ ని కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను SBI, ICICI మరియు HDFC క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.
Also Read: Philips Smartphone: ఇండియాలో కొత్త 5G లాంచ్ అనౌన్స్ చేసిన ఫిలిప్స్ .. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
రియల్ మీ పి4s స్మార్ట్ ఫోన్ ను పవర్ సిరీస్ కలిగిన అదే డిజైన్ తో కొత్త కలర్స్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను 6.78 ఇంచ్ M14 AMOLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ HDR 10+ మరియు నెట్ ఫ్లిక్స్ HDR సపోర్ట్ కలిగి గొప్ప విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో లాంచ్ చేసింది. ఇది అధిక ఫ్రేమ్స్ వద్ద గొప్ప గేమింగ్ మరియు మంచి విజువల్స్ అందిస్తుంది.
ఈ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ తో లాంచ్ అయ్యింది. ఇందులో ఫోన్ ను నడిపించడానికి మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ ను, ఫోన్ ను మరింత స్మూత్ గా నడిపించడానికి మరియు బెస్ట్ విజువల్స్ అందించడానికి హైపర్ విజన్ ప్లస్ AI చిప్ ను కూడా అందించింది. ఇందులో 12GB ఫిజికల్ ర్యామ్, 14GB డైనమిక్ ర్యామ్ ఫీచర్ తో టోటల్ 26GB ర్యామ్ సపోర్ట్ ను అందించింది. ఈ ఫోన్ లో 128GB మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది.
ఈ ఫోన్ కెమెరా వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా జతగా 8MP AI ఆల్టరీ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4k వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు HDR ఇమేజింగ్ వంటి ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ ఏఐ ఫీచర్స్ తో కూడా వస్తుంది.
ఇందులో 8000 mAh భారీ టైటాన్ బ్యాటరీని రియల్ మీ అందించింది. అలాగే, ఈ ఫోన్ ను చాలా వేగంగా ఛార్జ్ చేసే 80w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఫోన్ ను వేగంగా చల్లబరిచే ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ మరియు గొప్ప సౌండ్ కోసం 300% వాల్యూమ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇది IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా వచ్చింది.