Philips Smartphone: ఇండియాలో కొత్త 5G లాంచ్ అనౌన్స్ చేసిన ఫిలిప్స్ .. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

కొత్త ఫోన్ లాంచ్ చేయడానికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫిలిప్స్ ఉవ్విళ్లూరుతోంది

ఇప్పటికే ఇండియాలో 5జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ చాలా వేగంగా విస్తరించింది

మార్కెట్ ను గ్రాబ్ చేయడానికి ఫిలిప్స్ కూడా తన కొత్త 5G ఫోన్ ను రంగంలోకి దించుతోంది

Philips Smartphone: ఇండియాలో కొత్త 5G లాంచ్ అనౌన్స్ చేసిన ఫిలిప్స్ .. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Philips Smartphone: ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేయడానికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫిలిప్స్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఇండియాలో 5జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ చాలా వేగంగా విస్తరించింది. ఇప్పుడు ఈ మార్కెట్ ను గ్రాబ్ చేయడానికి ఫిలిప్స్ కూడా తన కొత్త 5G ఫోన్ ను రంగంలోకి దించుతోంది. వాస్తవానికి, ఈ ఫోన్ అనౌన్స్ కంటే ముందే ఈ ఫోన్ నెట్టింట్లో దర్శనమిచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Philips Smartphone: లాంచ్ డేట్

ఫిలిప్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ S771 మోడల్ నెంబర్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడమే కాకుండా ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.

Philips Smartphone: ఫీచర్స్

ఫిలిప్స్ S771 స్మార్ట్ ఫోన్ ను 5జి స్మార్ట్ ఫోన్ గా లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ తో వస్తుంది. ఇది రౌండ్ కార్నర్ మరియు కొంచెం మందమైన డిజైన్ లో కనిపిస్తుంది. ఈ ఫోన్ లో 120Hz స్మూత్ విజువల్స్ అందించే స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో అందించే చిప్ సెట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు.

Philips Smartphone

అయితే, ఈ ఫోన్ యొక్క లీక్డ్ హాండ్స్ ఆన్ వీడియో ప్రకారం, ఈ ఫోన్ Unosoc T8200 5జి చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను 6GB / 8GB ర్యామ్ మరియు 128GB / 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ చేస్తున్నట్లు ఫిలిప్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.

ఈ అప్ కమింగ్ ఫిలిప్స్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 64MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. అంతేకాదు, ఇందులో కెమెరాతో జతగా LED ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP 64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5700 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటాయి.

Also Read: Vivo T5 5G లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో .. టర్బో ఫీచర్స్ తో వస్తోంది.!

ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో మొబైల్ ఫోన్ ధరలు తారాస్థాయికి చేరుకోగా కొన్ని భారతీయ మొబైల్ తయారీ కంపెనీలు మాత్రం బడ్జెట్ ధరలో ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నాయి. మరి ఫిలిప్స్ ఈ ఫోన్ ను ఎటువంటి ధరలో అందిస్తుందో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile