Vivo T5 5G లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో .. టర్బో ఫీచర్స్ తో వస్తోంది.!

HIGHLIGHTS

Vivo T5 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు వివో అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను టర్బో ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ను రోజుకు ఒకటి చొప్పున రివీల్ చేస్తుంది

Vivo T5 5G లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో .. టర్బో ఫీచర్స్ తో వస్తోంది.!

Vivo T5 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు వివో అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను టర్బో ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఇటీవల వివో లాంచ్ చేసిన కొత్త ప్రీమియం ఫోన్ మాదిరి డిజైన్ తో అందిస్తుంది. ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా అందించిన మైక్రో టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T5 5G: లాంచ్ డేట్ ఏమిటి?

వివో టి5 5జి స్మార్ట్ ఫోన్ ను వచ్చేనెల ప్రారంభంలో లాంచ్. ఖచ్చితమైన డేట్ చెప్పాలంటే, సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ లాంచ్ డేట్ ని వివో వెల్లడించింది. కేవలం లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్లు కూడా ఈ పేజీ నుంచి ఒక్కొక్కటిగా రివీల్ చేయడం ప్రారంభించింది.

Vivo T5 5G: ఫీచర్స్

వివో వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చూడటానికి ఐకూ రీసెంట్ గా విడుదల చేసిన Z11 స్మార్ట్ ఫోన్ మాదిరిగా కనిపిస్తుంది. వివో టి5 5జి స్మార్ట్ ఫోన్ కూడా ముందు మరియు వెనుక అదే కర్వుడ్ డిజైన్ మరియు పైన అడ్డంగా ఉన్న పెద్ద కెమెరా బంప్ ని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ వివో ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.

Vivo T5 5G

వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని టర్బో ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు టీజింగ్ చేసింది. వివో ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ టర్బో పెర్ఫార్మన్స్ అందించే మీడియా టెక్ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో టర్బో డిస్ప్లే, టర్బో బ్యాటరీ మరియు టర్బో కెమెరా కూడా ఉంటాయని వివో టీజింగ్ చేస్తోంది.

Also Read: అండర్ రూ. 7,000 ధరలో 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్ చెక్ చేస్తుంటే .. ఒక లుక్కేయండి.!

ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ అప్ కమింగ్ వివరాలు అందించింది. ఈ ఫోన్ సిల్వర్ గ్రీన్ మరియు రాయల్ బ్రోన్జ్ రెండు రంగుల్లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ను రోజుకు ఒకటి చొప్పున రివీల్ చేస్తుంది. ఈ ఫోన్ మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile