Realme P4 Power: భారీ 10,001 mAh బ్యాటరీతో అవాక్కయ్యే ధరలో రిలీజ్ అయ్యింది.!
రియల్‌మీ బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ పి4 పవర్ ఎట్టకేలకు ఈరోజు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది
ఈ స్మార్ట్ ఫోన్ భారీ 10,001 mAh బ్యాటరీతో అవాక్కయ్యే ధరలో రిలీజ్ అయ్యింది
ప్రీమియం డిజైన్, ఫాస్ట్ చిప్ సెట్ మరియు గొప్ప డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్స్ తో వచ్చింది
Realme P4 Power: రియల్‌మీ బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ పి4 పవర్ ఎట్టకేలకు ఈరోజు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ 10,001 mAh బ్యాటరీతో అవాక్కయ్యే ధరలో రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్, ఫాస్ట్ చిప్ సెట్ మరియు గొప్ప డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్స్ తో వచ్చింది. ఈ లేటెస్ట్ రియల్‌మీ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.
SurveyRealme P4 Power: ప్రైస్
రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ క్రింద చూడవచ్చు.
రియల్‌మీ పి4 పవర్ (8GB + 128GB) ప్రైస్ : రూ. 27,999
రియల్‌మీ పి4 పవర్ (8GB + 256GB) ప్రైస్ : రూ. 29,999
రియల్‌మీ పి4 పవర్ (12GB + 256GB) ప్రైస్ : రూ. 32,999
ఈ ఫోన్ మొదటి సేల్ ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ పై గొప్ప ఆఫర్స్ కూడా రియల్‌మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ బ్లూ మరియు ట్రాన్స్ ఆరెంజ్ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్
రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ పై మూడు బిగ్ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై Axis, HDFC, ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్ ఆప్షన్ తో రూ. 2,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇదే కాదు రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకర్తి మాత్రమే వర్తిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల ప్రత్యేకమైన లోయల్టి బోనస్ మరియు రూ. 999 రూపాయలకే ఎక్స్ ప్లోర్ ప్యాక్ ను కూడా అందిస్తుంది. ఇందులో Buds T200 Lite, అడ్వెంచర్ బ్యాక్ ప్యాక్ మరియు 4 ఇయర్ బ్యాటరీ వారంటీ వంటివి ఉంటాయి.
Also Read: Redmi Note 15 Pro : భారీ 200MP కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Realme P4 Power: ఫీచర్స్
రియల్‌మీ పి4 పవర్ ఫోన్ లో పెద్ద 6.79 ఇంచ్ 4D కర్వుడ్ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్ గొప్ప 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR 10+ సపోర్ట్, Netflix HDR సపోర్ట్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, గొప్ప విజువల్స్ కోసం హైపర్ విజన్ ప్లస్ AI చిప్ సెట్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra చిప్ సెట్ తో వచ్చింది. ఇందులో 8 జీబీ / 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ అందించింది. ఇది గొప్ప పెర్ఫార్మన్స్ అందించే సత్తా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన కెమెరా సెటప్ ఉంది. ఈ సెటప్ తో ఈ ఫోన్ 30FPS వద్ద 4K EIS/OIS స్టేబుల్ వీడియోలు మరియు గొప్ప AI ల్యాండ్ స్కేప్ ఫోటోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో గొప్ప AI కెమెరా ఫీచర్స్ కూడా వున్నాయి. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే, ఇది ఒక బ్యాటరీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో నిలిచింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను 10,001 mAh బిగ్ టైటాన్ బ్యాటరీని అందించింది. ఇది 80 W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 27W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఫోన్ గా కూడా ఉంటుంది.