మే 28న సెగ్మెంట్ టాప్ ఫీచర్స్ తో Realme Narzo N65 5G లాంచ్ అవుతోంది.!

మే 28న సెగ్మెంట్ టాప్ ఫీచర్స్ తో Realme Narzo N65 5G లాంచ్ అవుతోంది.!
HIGHLIGHTS

మే 28న Realme Narzo N65 5G లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది

ఈ ఫోన్ కీలకమైన ఫీచర్ లతో టీజింగ్ ను అందించింది

ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా రియల్ మీ తీసుకు వస్తోంది

Realme GT 6T స్మార్ట్ ఫోన్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన రియల్ మీ, మరో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ను కూడా అనౌన్స్ చేసింది. సెగ్మెంట్ టాప్ ఫీచర్స్ తో మే 28న Realme Narzo N65 5G లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లంచ్ డేట్ తో పాటుగా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్ లతో టీజింగ్ ను అందించింది.

Realme Narzo N65 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?

రియల్ మీ నార్జో ఎన్ 65 5జి స్మార్ట్ ఫోన్ ను మే 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా రియల్ మీ తీసుకు వస్తోంది మరియు అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది.

Realme Narzo N65 5G కీలకమైన ఫీచర్లు ఏమిటి?

ఈ ఫోన్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కాంపిటీటివ్ ఫీచర్స్ తో తీసుకువస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ ప్రోసెసర్ Dimensity D6300 తో వస్తుందని తెలిపింది. ఈ బడ్జెట్ లో ఇతర ఫోన్ లు Dimensity 6100+ తో వస్తుండగా, ఈ ఫోన్ D6300 ప్రోసెసర్ తో వస్తుందని, రియల్ మీ గొప్పగా చెబుతోంది.

Realme Narzo N65 5G Features
Realme Narzo N65 5G Features

ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ లో 6.67 ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే ఉందని కూడా తెలిపింది. ఈ డిస్ప్లే HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుందని కూడా కనర్మ్ చేసింది. ఈ ఫోన్ లో 50MP దుస్ల్ రియర్ కెమెరా సెటప్ కూడా వుంది.

Also Read: iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్లతో తక్కువ ధరలో లభిస్తోంది.!

ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో ఛార్జ్ మరియు బ్యాటరీ వివరాలను కూడా అందించింది. ఈ ఫోన్ ను 5000mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు తెలిపింది.

ఈ ఫోన్ 2TB ఎక్స్ పాండబుల్ మెమరీ, మినీ క్యాప్స్యూల్ మరియు ఎయిర్ జెశ్చర్ వంటి ఫీచర్స్ తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ లో IP54 వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ కూడా రైన్ వాటర్ స్మార్ట్ టచ్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 OS తో పని చేస్తుందని కూడా తెలిపింది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo