Realme Narzo N61: గట్టి ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

HIGHLIGHTS

నార్జో N60 సిరీస్ నుండి కొత్త ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది

Realme Narzo N61 ఫోన్ ఫీచర్స్ తో రియల్ మీ టీజింగ్ ను మొదలు పెట్టింది

ఈ ఫోన్ చూడగానే ఆకర్షించే డిజైన్ తో అందించినట్లు కనిపిస్తోంది

Realme Narzo N61: గట్టి ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

Realme Narzo N61: రియల్ మీ నార్జో N60 సిరీస్ నుండి కొత్త ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. అదే రియల్ మీ నార్జో N61 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను గట్టి ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ తో తీసుకొస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ ఫీచర్స్ తో రియల్ మీ టీజింగ్ ను మొదలు పెట్టింది. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది మరియు ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Narzo N61 : లాంచ్

రియల్ మీ నార్జో ఎన్ 61 స్మార్ట్ ఫోన్ జూలై 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా వస్తుంది మరియు ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి మరియు బ్యానర్ పేజిని కూడా ఇప్పటికే అందించింది.

Realme Narzo N61 : ఫీచర్స్

రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఎక్కువ వివరాలు అందించలేదు. కానీ ఈ ఫోన్ డిజైన్, కెమెరా మరియు ఇతర వివరాలు ఇమేజ్ ద్వారా చెప్పకనే చెప్పింది. ఈ ఫోన్ చూడగానే ఆకర్షించే డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ రౌండ్ కార్నర్స్ మరియు డిఫరెంట్ గ్రాఫిక్ కలిగిన బ్యాక్ ప్యానల్ మరియు రెండు కలర్ లలో కనిపిస్తోంది.

Realme Narzo N61 Launch

క్రింద జారిపడినా హాని కలగని విధంగా ఈ ఫోన్ ను గట్టి ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ తో తీసుకొస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ IP54 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు చూడవచ్చు. ఈ కెమెరా సెటప్ లో 32MP ప్రధాన కెమెరా ఉన్నట్లు కూడా చూడవచ్చు. అలాగే, ఈ ఫోన్ లో టైప్ C ఛార్జ్ పోర్ట్ మరియు పక్కనే 3.5mm జాక్ వుంది.

Also Read: GOAT సేల్ చివరి రోజు SONY Bravia 2 Smart Tv ల పైన భారీ ఆఫర్లు ప్రకటించిన Flipkart

ఈ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ చూస్తుంటే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చే 4G స్మార్ట్ ఫోన్ కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ ఫీచర్స్ వెల్లడి అయిన తర్వాత ఈ ఫోన్ పైన ఒక అంచనా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo