Realme Narzo 90 5G స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.!
Realme Narzo 90 5G టాప్ 5 ఫీచర్స్ ని కంపెనీ ముందే రివీల్ చేసింది
బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది
ఈ ఫోన్ కేవలం 7.79mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది
Realme Narzo 90 5G స్మార్ట్ ఫోన్ మరో నాలుగు రోజుల్లో లాంచ్ అవుతుందనగా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ని కంపెనీ ముందే రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ స్లీక్ డిజైన్, సోనీ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియల్ మీ విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
SurveyRealme Narzo 90 5G : టాప్ 5 ఫీచర్స్
డిజైన్
ఈ స్మార్ట్ ఫోన్ విక్టరీ పవర్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.79mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు కేవలం 181 గ్రాముల బరువుతో చాలా లైట్ గా ఉంటుందని కంపెనీ తెలిపింది.
డిస్ప్లే
రియల్ మీ నార్జో 90 5జి స్మార్ట్ ఫోన్ ఎండలో కూడా బాగా కనిపించే 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే కలిగి ఉంటుంది.
కెమెరా
ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Ai ఎడిట్ జీనీ మరియు ఎఐ ఎడిటర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

బ్యాటరీ
ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 60W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ 6 సంవత్సరాల లైఫ్ గ్యారెంటీ కూడా అందిస్తుందని కూడా రియల్ మీ తెలిపింది.
Also Read: Andhra King Taluka OTT లో రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే.!
IP రేటింగ్
రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను గొప్ప IP రేటింగ్ తో అందిస్తున్నట్లు రియల్ మీ ఈ ఫోన్ ఫీచర్ విడుదల చేసింది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో ఉంటుంది.
రియల్ మీ నార్జో 90 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.