Realme Narzo 80 Lite సర్ప్రైజింగ్ లాంచ్ : ధర మరియు ఫీచర్స్ ఇవే.!
Realme Narzo 80 Lite విడుదల చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది
రియల్ మీ ఈ ఫోన్ లాంచ్ గురించి సడన్ గా అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ యొక్క ప్రైస్ మరియు కీలక ఫీచర్లు కూడా అందించింది
Realme Narzo 80 Lite స్మార్ట్ ఫోన్ ను రేపు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. రియల్ మీ 15 సిరీస్ ఫోన్ల లాంచ్ గురించి చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న రియల్ మీ, ఈ ఫోన్ లాంచ్ గురించి సడన్ గా అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క ప్రైస్ మరియు కీలక ఫీచర్లు కూడా అందించింది.
SurveyRealme Narzo 80 Lite : లాంచ్
రియల్ మీ ఈ ఫోన్ ను రేపు, అనగా జూలై 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇదే పేజీ నుంచి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్ మరియు ఈ ఫోన్ ప్రైస్ వివరాలు కూడా వెల్లడించింది.
Realme Narzo 80 Lite : ప్రైస్
రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ అండర్ రూ. 7000 బిగ్ బ్యాటరీ కలిగిన ఫోన్ గా వస్తుంది, అని కంపెనీ ఈ ఫోన్ గురించి టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ ను అండర్ రూ. 7,000 ధరలో లాంచ్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ అవుతున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మరియు రియల్ మీ 15 సిరీస్ కంటే ఒకరోజు ముందే సర్ప్రైజ్ లాంచ్ అవుతోంది.
Also Read: ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్న లేటెస్ట్ బెస్ట్ Dolby Audio Soundbar డీల్ కోసం చూస్తున్నారా.!
రియల్ మీ నార్జో 80 లైట్ : ఫీచర్లు
రియల్ మీ నార్జో 80 లైట్ స్మార్ట్ ఫోన్ యొక్క బ్యాటరీ ఫీచర్స్ గురించి రియల్ మీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ ను 6300mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కలిగిన ఈ పెద్ద బ్యాటరీతో 20.7 గంటల యూట్యూబ్ లేదా 46.5 గంటల కాలింగ్ లేదా 19 గంటల ఇంస్టాగ్రామ్ లేదా 13.6 గంటల గేమింగ్ ను ఆస్వాదించవచ్చు అని చెబుతోంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో అందించిన ఛార్జ్ టెక్ గురించి కూడా రియల్ మీ వివరాలు అందించింది. ఈ ఫోన్ ను 15W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 6W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తున్నట్టు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ టైప్ ఛార్జ్ పోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా, HD డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లు ఉండే అవకాశం ఉంటుంది.