చాలా అంచనాలు లీక్స్ తరువత ఎట్టకేలకు రియల్మీ తన Narzo 30 Pro స్మార్ట్‌ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ 5G సపోర్ట్ తో కేవలం మిడ్ రేంజ్ ధరలో ప్రకటించి ఆ అందరిని ఆశ్చర్యపరిచింది . ఇందులో, వేగవంతమైన 5G ప్రొసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లను అందించింది. ఈ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
రియల్మీ నార్జో 30 ప్రో 6GB + 64GB వేరియంట్ ధర :Rs.16,999
రియల్మీ నార్జో 30 ప్రో 8GB + 128GB వేరియంట్ ధర :Rs.16,999
మార్చ్ 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదటి సేల్ మొదలవుతుంది.
ఇక రియల్మీ నార్జో 30 ప్రో స్పెషిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 6.5 ఇంచ్ ఫుల్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ప్రాసెసర్ మీడియా టెక్ హీలియో 800U SoC తో పనిచేస్తుంది. ఇది 2.4 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు మాలి -G57 GPU తో వుంటుంది. ఈ ప్రోసిజర్ కి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. ఆడియో పరంగా కూడా, Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ తో ఉంటుంది.
ఇక కెమెరా విభాగానికి వస్తే, రియల్మీ నార్జో 30 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 48MP ప్రధాన కెమెరా 110 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి జతగా 4CM మ్యాక్రో సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 16MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. .
ఇక ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ రియల్మీ నార్జో 30 ప్రో, పెద్ద 5,000 mAh బ్యాటరీని 30W డార్ట్ ఛార్జ్ సపోర్టుతో కలిగి వుంటుంది.