Realme ఇంత చీప్ రేటుకే 5G ఫోన్ లాంచ్ చేసిందా…!

HIGHLIGHTS

ఇప్పటికే ఇండియాలో చాలా 5G స్మార్ట్‌ఫోన్స్ వచ్చాయి.

రియల్మీ నార్జో 30 ప్రో 5G తక్కువ ధరలో వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్

చాలా ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల

Realme ఇంత చీప్ రేటుకే 5G ఫోన్ లాంచ్ చేసిందా…!

ఇప్పటికే ఇండియాలో చాలా 5G స్మార్ట్‌ఫోన్స్ వచ్చాయి. అయితే, ఈరోజు రియల్మీ ఈరోజు లాంచ్ చేసిన రియల్మీ నార్జో 30 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అన్నింటికన్నా తక్కువ ధరలో వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్ గా నిలుస్తుంది. ఈ రియల్మీ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.16,999 రూపాయల ధరలో డ్యూయల్ 5G తో వస్తుంది. అంతేకాదు, DOLBY ATMOS మరియు Hi-Res ఆడియో సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి చాలా ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల చేసింది.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రియల్మీ నార్జో 30 ప్రో 5G : ధర

రియల్మీ నార్జో 30 ప్రో 6GB + 64GB వేరియంట్ ధర :Rs.16,999

రియల్మీ నార్జో 30 ప్రో 8GB + 128GB వేరియంట్ ధర :Rs.16,999  

మార్చ్ 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదటి సేల్ మొదలవుతుంది.

రియల్మీ నార్జో 30 ప్రో 5G: స్పెషిఫికేషన్స్  

ఇక రియల్మీ నార్జో 30 ప్రో పెద్ద 6.5 ఇంచ్ FHD+ రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ లేటెస్ట్ 5G ప్రాసెసర్, డైమెన్సిటీ 800U తో పనిచేస్తుంది. ఇది 2.4 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు మాలి -G57 GPU తో వుంటుంది. దీనికి జతగా, 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. ఆడియో పరంగా కూడా, Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ తో ఉంటుంది.  

రియల్మీ నార్జో 30 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 48ఎంపీ ప్రధాన కెమెరా 110 డిగ్రీల 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్  కెమెరాకి జతగా 4CM మ్యాక్రో సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 16ఎంపీ సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. .

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ రియల్మీ నార్జో 30 ప్రో, పెద్ద 5,000 mAh బ్యాటరీని 30W డార్ట్ ఛార్జ్ సపోర్టుతో కలిగి వుంటుంది.                        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo