Realme GT7: ప్రత్యేకమైన బ్యాటరీ చిప్ మరియు 7000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
Realme GT7 టీజింగ్ జోరును రియల్ మీ మరింత వేగం చేసింది
ఈ ఫోన్ ప్రత్యేకమైన బ్యాటరీ చిప్ మరియు 7000 mAh బ్యాటరీతో వస్తుంది
ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ ను కూడా వెల్లడించింది
Realme GT7: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ జోరును రియల్ మీ మరింత వేగం చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ ఈరోజు ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ ను కూడా వెల్లడించింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన బ్యాటరీ చిప్ మరియు 7000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది.
Realme GT7: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ మే 27వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరుగుతున్న ప్రత్యేకమైన కార్యక్రమం నుంచి ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ తో పాటు GT 7T స్మార్ట్ ఫోన్ ను కూడా రియల్ మీ లాంచ్ చేస్తోంది.
Realme GT7: కీలకమైన ఫీచర్స్
రియల్ మీ ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు మరికొన్ని కీలకమైన ఫీచర్స్ కూడా ముందే వెల్లడించింది. ముందుగా ఈ ఫోన్ యొక్క కూలింగ్ సిస్టం గురించి రియల్ మీ టీజింగ్ చేసింది. అదేమిటంటే, ఈ ఫోన్ చాలా వేగంగా చల్లబడేలా చేసే గ్రాఫీన్ కవర్ ఐస్ సెన్స్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ చాలా వేగంగా చల్లబరుస్తుంది. ఈరోజు ఈ ఫోన్ యొక్క బ్యాటరీ ఫీచర్స్ కూడా వెల్లడించింది.
రియల్ మీ ఈ ఫోన్ ను 10% సిలికాన్ యానోడ్ కలిగిన 7000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ బ్యాటరీ లైఫ్ పెంచడానికి మరియు ఈ బ్యాటరీ వేడెక్కకుండా పర్యవేక్షించే ప్రత్యేకమైన రియల్ మీ లాంగ్ లైఫ్ బ్యాటరీ చిప్ ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ కలిగిన ఛార్జ్ సపోర్ట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 7.5 రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
Also Read: Lava Agni 3 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 15,998 ఆఫర్ ధరకే అందుకోండి.!
ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు టీజర్ ఇమేజెస్ సూచిస్తున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ కూడా రియల్ మీ యొక్క లేటెస్ట్ హైపర్ ఇమేజ్ ప్లస్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో AI కోసం ప్రత్యేకమైన బటన్ ఉంటుంది. రియల్ మీ జిటి పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను మే 14వ తేదీ వెల్లడించనున్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ కొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.