Realme GT 7: 4K Dolby Vision కెమెరా సెటప్ తో లాంచ్ అవుతోంది.!
Realme GT 7 కీలకమైన ఫీచర్స్ పాటు కెమెరా ప్రత్యేకతలు కూడా వెల్లడించింది
రియల్ మీ ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ అన్నింటిని ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది
ఈ ఫోన్ 4K Dolby Vision మరియు 4K 120FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది
Realme GT 7: రియల్ మీ GT సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ GT 7 యొక్క కీలకమైన ఫీచర్స్ పాటు కెమెరా ప్రత్యేకతలు కూడా వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా వారం రోజులు సమయం ఉండగా, రియల్ మీ ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ అన్నింటిని ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది. ఈ ఫోన్ 4K Dolby Vision మరియు 4K 120FPS వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన కెమెరా సెటప్ కలిగి ఉంటుందని రియల్ మీ కొత్తగా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.
Realme GT 7 : ఫీచర్స్
రియల్ మీ GT స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ వెల్లడించింది. ఈ ఫోన్ మే 27వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ కలిగిన ముఖ్యమైన వివరాలు కంపెనీ వెల్లడించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క బ్యాటరీ, డిజైన్ మరియు కలర్ వేరియంట్ వివరాలు ముందుగా అందించిన రియల్ మీ, ఈరోజు ఈ ఫోన్ కెమెరా ప్రత్యేకత కూడా వెల్లడించింది.
ఈ ఫోన్ లో 4K Dolby Vision మరియు 4K 120FPS సపోర్ట్ కలిగిన కెమెరా సెటప్ ఉందని రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో Sony IMX 906 ప్రధాన సెన్సార్, 50MP రెండవ సెన్సార్ మరియు 112° వైడ్ యాంగిల్ సెన్సర్లు ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 60FPS తో 4K Dolby Vision వీడియోలు మరియు 120FPS తో 4K వీడియోలను అందించే సత్తా కలిగి ఉంటుందని రియల్ మీ పేర్కొంది.
ఇక ఈ ఫోన్ గురించి ముందుగా రియల్ మీ అందించిన కీలకమైన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ గ్రాఫీన్ కవర్ ఐస్ సెన్స్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది ఈ ఫోన్ ను మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ సమయంలో ఫోన్ ను చల్లగా ఉంచుతుందట. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు వైర్డ్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 7000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. బ్యాటరీ పర్యవేక్షణ కోసం ప్రత్యేకమైన బ్యాటరీ చిప్ ను కూడా ఈ ఫోన్ లో రియల్ మీ అందించింది.
రియల్ మీ GT స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 9400e చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇది హై పెర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ మరియు 3nm ప్రోసెస్ టెక్నాలజీ పై నిర్మించబడింది. ఈ చిప్ సెట్ లేటెస్ట్ మరియు పవర్ ఫుల్ AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది 24,50,000 కు పైగా AnTuTu స్కోర్ అందిస్తుందని రియల్ మీ తెలిపింది.
Also Read: OnePlus 13s ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!
ఈ ఫోన్ గేమింగ్ కోసం గొప్పగా ఉంటుందని రియల్ మీ తెలిపింది. ఎలాగంటే, ఈ ఫోన్ BGMI గేమ్ ను 120FPS వద్ద 6 గంటలకు పైగా స్టేబుల్ గేమింగ్ అందిస్తుందని రియల్ మీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన పవర్ ఫుల్ డిస్ప్లే కూడా ఉందట. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ గేమింగ్ కోసం గొప్పగా ఉంటుందని రియల్ మీ గొప్పగా చెబుతోంది.