OnePlus 13s ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!
OnePlus 13s ఇండియా లాంచ్ కోసం చాలా కాలంగా టీజింగ్ చేస్తూ వస్తున్న వన్ ప్లస్
ఎట్టకేలకు ఈరోజు OnePlus 13s స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది
ఈ ఫోన్ కలిగిన కీలకమైన ఫీచర్స్ కూడా ఈరోజు వెల్లడించింది
OnePlus 13s ఇండియా లాంచ్ కోసం చాలా కాలంగా టీజింగ్ చేస్తూ వస్తున్న వన్ ప్లస్, ఎట్టకేలకు ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ ఫోన్ కలిగిన కీలకమైన ఫీచర్స్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఒద్దికైన సైజులో పవర్ ప్యాక్ గా ఈ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు వన్ ప్లస్ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.
OnePlus 13s : లాంచ్ డేట్
వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు డేట్ మరియు టైం కన్ఫర్మ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్ కోసం చేపట్టిన టీజర్ పేజీ మరియు అధికారిక X అకౌంట్ నుంచి ఈ అప్డేట్ ను వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ కలిగిన కీలకమైన ఫీచర్స్ కూడా ఈరోజు వెల్లడించింది.
OnePlus 13s : ఫీచర్స్
వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ అవుతోంది. ఈ చిప్ సెట్ 3nm ఫ్యాబ్రికేషన్ చిప్ సెట్ మరియు గరిష్టంగా 4.32 GHz వరకు క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది ఇది గొప్ప AI సత్తా కలిగి ఉంటుంది. వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ కేవలం 6.32 ఇంచ్ సైజు డిస్ప్లేతో చాలా ఒద్దికైన కాంపాక్ట్ సైజులో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కలిగిన సైజులో ఈ ఫోన్ పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు బెస్ట్ బ్యాటరీ లైఫ్ అందిస్తుందని వన్ ప్లస్ చెబుతోంది.
వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ అడ్వాన్స్డ్ 5.5G నెట్ వర్క్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంటే, ఈ ఫోన్ ఫ్యూచర్ రెడీ ఫోన్ గా కూడా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో AI మరియు మరిన్ని పనుల కోసం ప్రత్యేకమైన బటన్ కూడా ఉంటుంది. ఇందులో మరొక ప్రత్యేకమైన ఫీచర్ కూడా ఒకటి ఉంటుంది. అదే వేగవంతమైన ఇంటర్నెట్ కోసం అందించిన ప్రత్యేకమైన G1 Wi-Fi చిప్ సెట్. ఈ చిప్ సెట్ అంతరాయం లేని Wi-Fi వేగాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది.
Also Read: Samsung Smart Tv ని చవక ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఇది కాకుండా ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ అవుతుందని కూడా అర్థం అవుతుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా త్వరలోనే వెల్లడిస్తుందని కంపెనీ తెలిపింది.